ఇన్నో కెయిజ్ ...ఇదోటి ఉందా...భలే కంపెనీ

 ఇన్నోకైజ్ ఇండియా కంపెనీకి రూ.3.2 కోట్ల ఆర్డర్ లభించింది. నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి

ఈ ఆర్డర్ రాగా, కంపెనీ షేర్లు పండగ చేసుకుంటున్నాయ్. చిన్న మొత్తంలోనే ఈ కౌంటర్ వాల్యూమ్స్

జరుగుతుండగా స్టాక్ రేటు రూ.121.10 దగ్గర కదలకుండా లక్కవేసినట్లు అతుక్కుపోయాయ్


ఈ కంపెనీ ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ,డిజిటల్ మార్కెటింగ్, కార్పొరేట్ సర్వీసులు

అడ్వర్టైజింగ్,గిఫ్ట్ సొల్యూషన్స్ చేస్తుండగా, ఈమద్యనే ఈకామర్స్ రంగంలో అడుగుపెట్టినట్లు చెప్పుకుంటోంది

బస్ షెల్టర్లు, పోల్ కియోస్క్, అక్రిలిక్ బోర్డులు, సిగ్నల్ పోస్టులు ఇలా రకరకాలుగా తమ పబ్లిసిటీ వ్యాపారం

చేస్తుంటుంది

Innokaiz India Ltd. 121.10 4.00 (3.43%)

Comments