ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్ షేర్లకు షాక్



శుక్రవారం మార్కెట్‌లో ఇండియన్ ఎనర్జీఎక్స్‌ఛేంజ్ -IEX పెద్ద షాక్‌కి గురైంది. ఇంట్రాడేలో 15శాతం చతికిలబడింది.

దీంతో స్టాక్ తన 52వీక్స్ లోలెవల్‌కి జారిపోయింది. రూ.116 దగ్గర చాలాసేపు ట్రేడై..తర్వాత కాసింత మాత్రమే తెప్పరిల్లి

రూ.122 దగ్గర ట్రేడ్ అవుతోంది


విద్యుత్ మంత్రిత్వ శాఖ కేంద్రానికి  ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) పవర్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్‍‌ఫామ్స్ అన్నీ కలిపేసి సింగిల్

పవర్ట్రేడింగ్ ఎంటిటీగా చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అదికూడా ఓ డెడ్‌లైన్ లోపే అనేసరికి.. ప్రస్తుతానికి ఈ రంగంలో మోనోపలిగా ఉన్న

IEX ఆధిపత్యంపై ఆందోళన కలిగించింది. 


దేశంలోని ప్రీమియర్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ‌గా ఐఈఎక్స్ విరాజిల్లుతోంది. ఎక్కువ సేల్ వాల్యూమ్స్ కూడా ఇక్కడే నమోదు అవుతున్నాయ్. తాజా పరిణామాల నేపథ్యంలో స్టాక్ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో 22 శాతం పడిపోయింది.  ఈ స్టాక్ మార్చి 29, 2023న తాకిన దాని మునుపటి కనిష్టమైన రూ. 125.75 కంటే దిగువకు పడిపోయింది. 

స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి IEX షేర్లు రూ.122.15 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments