మార్కెట్లు వరసగా రెండో రోజు లాభంతో ప్రారంభం

 మార్కెట్లు వరసగా రెండో రోజు లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిప్టీ 18750 పాయింట్ల వరకూ పెరిగింది

సెన్సెక్స్ 63వేల పాయింట్లపైనే ట్రేడవుతోంది.


బ్యాంక్ నిఫ్టీ కొద్దిపాటి లాభంతో ట్రేడవుతుండగా, ఐటీ ఇండెక్స్ పావుశాతంలాభపడింది

స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లు ర్యాలీ చేస్తున్నాయ్.దీంతోగత పదిహేను సెషన్లలో ఒక్క సెషన్

మినహాయించి ఈ స్టాక్స్ జైత్రయాత్ర కేక పుట్టిస్తోంది. ఆటో,కేపిటల్ గూడ్స్ అరశాతం వరకూ గెయిన్ చేయగా

కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం నష్టాలపాలయ్యాయ్.మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ, హెల్త్ కేర్

సెక్టార్లు అరశాతం నుంచి ఒకశాతం వరకూ ర్యాలీ చేశాయ్


టాప్ గెయినర్లుగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, అపోలో హాస్పటల్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఆటో,టాటాస్టీల్ 

ఒకటి నుంచి రెండున్నరశాతం వరకూ లాభపడ్డాయ్. ఇండస్ఇండ్ బ్యాంక్,సిప్లా, టైటన్ కంపెనీ

యుపిఎల్, సన్‌ఫార్మా అరశాతం నుంచి ఒకశాతం వరకూనష్టపోయి టాప్ 5 లూజర్లుగా ట్రేడవుతున్నాయ్

Comments