కల్యాణ్ జ్యుయెలరీస్ ధగధగ

 ఒకప్పుడు నష్టజాతక కంపెనీగా ముద్రేసుకున్న కల్యాణ్ జ్యుయెలరీస్

ఇప్పుడు ధగధగలాడుతోంది. ఇం


ట్రాడేలో ఇవాళ 13శాతం పెరిగి

రూ.128.60 రేటుకి చేరింది. గుర్తున్నంతవరకూ ఈ స్టాక్ అలాట్‌మెంట్ 

ప్రైస్ రూ.75..లిస్టింగ్ రోజున నష్టాలను కూడా పంచినట్లుంది. ఐతే

బ్రాండింగ్ కి ఉన్న వేల్యూ కారణంగా..ఎప్పటికైనా మంచి లాభం తెచ్చిపెడుతుందని

ఎక్కువమంది నిపుణులు నామినల్‌గా రికమండ్ చేసేవాళ్లు..


ఈ రోజు వరకూ మల్టిపుల్ బ్లాక్ డీల్స్ చోటు చేసుకోవడంతోనే స్టాక్ రేటు భారీగా

పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క రోజే ఆరున్నకోట్ల షేర్లు చేతులు మారాయ్

ఇది మొత్తం ఈక్విటీలో 6.2శాతానికి సమానం


ఈ స్టాక్ 52వీక్స్ లో ప్రైస్ రూ.55కాగా..అది ఖచ్చితంగా గతేడాది జూన్‌లోనే కావడం

విశేషం. అలా చూస్తే..ఈస్టాక్ ఏడాది కాలంలో వందశాతానికి మించి లాభం పంచినట్లు లెక్క

52వారాల గరిష్ట ధర రూ.134 కాగా..దాన్ని అధిగమించే సూచనలు కన్పిస్తున్నాయ్

Comments