సైయెంట్ DLM ఐపిఓ మిస్ కాకుండా అప్లై చేయండి ..మంచి లాభం రావచ్చు

 ప్రొవైడర్ సైయెంట్ డిఎల్ఎం సంస్థ ఐపిఓ ఓపెన్ చేసింది. ఇష్యూ కోసం

అప్లికేషన్ బిడ్లను జూన్ 27 నుంచి జూన్ 30 వరకూ తీసుకోనుందీ సంస్థ

రూ.592కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఈ ఐపిఓ వస్తుండగా..షేర్ అలాట్ మెంట్ 

ప్రైస్ బ్యాండ్ రూ.250-265గా ఫిక్స్ చేసింది


క్యుఐబి పోర్షన్ కోసం రూ.432 కోట్లు, ఎన్ఐఐలకు రూ.86.55కోట్లుకాగా..రిటైల్ ఇన్వెస్టర్లకు

57.70కోట్లరూపాయల విలువ గల షేర్లను రిజర్వ్ చేసింది. ప్రిఐపిఓ ప్లేస్‌మెంట్ కింద 40లక్షల 75వేల 

షేర్లను అట్టిపెట్టగా..దాంతోనే రూ.108కోట్లు రాబట్టనుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్ల పోర్షన్ జూన్ 26నే

ఫిల్ చేయనుంది..ఎలా చూసినా కూడా సంస్థకి ఈ ఐపిఓ లిస్ట్ కాకముందే మంచి ఆదరణ దక్కే అవకాశాలు

కన్పిస్తున్నాయ్


సైయెంట్ సబ్సిడరీ సంస్థ కావడంతో..కావలిసినంత బ్రాండ్ ప్రమోషన్ లభిస్తుంది. హైలీ కాంప్లెక్స్, సేఫ్టీ క్రిటికల్ సెగ్మెంట్లకుఅవసరమైన ఎలక్ట్రానిక్స్ 

మేన్యుఫేక్చరింగ్ విభాగాలపై సైయెంట్ డిఎల్ఎం వ్యాపారం చేస్తుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధితో రూ.832కోట్లు ఆదాయం

,31.4కోట్ల లాభం గడించినట్లు కంపెనీ చెప్తోంది.ఐపిఓతోవచ్చిన డబ్బులతో కేపిటల్ ఎక్స్‌పెండిచర్..అప్పు చెల్లింపు చేయనున్నట్లు తెలుస్తోంది


Comments