HAL షేర్లు ఇవాళ కేక పుట్టించేశాయ్

 HAL షేర్లు ఇవాళ కేక పుట్టించేశాయ్. ఉదయం స్టాక్స్ ఇన్ న్యూస్‌లో అలర్ట్ చేసిన విధంగానే

స్టాక్ స్పీడ్‌గా ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో 4శాతానికిపైగా ర్యాలీ చేసి కొత్త గరిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో రూ.3659.25 రేటు దగ్గర

న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది


గత మూడేళ్ల క్రితం పడిపోయిన రేటుతో పోల్చితే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేర్ల రేటు 700శాతం రిటన్ ఇచ్చింది. అప్పట్లో స్టాక్ రేటు

 రూ. 448కి పతనం అయింది


ఇవాళ్టి బజ్‌కి  కంపెనీ డైరెక్టర్ల బోర్డు జూన్ 27న సమావేశమై ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల స్టాక్ స్ప్లిట్ ప్రతిపాదనను పరిశీలించనుంది

దీంతో స్టాక్ పై ట్రేడర్లు కన్ను పడటంతోనే హెవీ వాల్యూమ్స్ కూడా రికార్డవుతున్నాయ్. 


విమానాలు, హెలికాప్టర్లు, ఇంజన్లు మరియు ఏవియానిక్స్, సాధనాలు, ఉపకరణాలు వంటి ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, నిర్వహణ, మరమ్మత్తు, మరమ్మత్తు మరియు సేవలను చేపట్టడం HAL యొక్క ప్రధాన వ్యాపారంగా ఉండగా, అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కూడా కలిసి పనిచేస్తుంది. HALలో  GoI ప్రస్తుతం 75 శాతం వాటాతో HALలో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉంది


స్టోరీ పబ్లిష్ చేసే టైమ్‌కి HAL షేర్లు రూ.3641 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments