ICICI సెక్యూరిటీస్ స్టాక్ డీలిస్ట్ కాబోతోంది..ఎందుకో తెలుసా

 ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ని డీలిస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి...ఐసిఐసిఐ సర్ ప్రైజ్ షాక్ ఇచ్చింది

చాలామందికి ఇది చక్కగా ఉన్న సంస్థే కదా..ఎందుకిలాంటి నిర్ణయం అనూహ్యంగా తెరపైకి తెచ్చారనేది 

అర్థం కాలేదు


క్యాష్ రిచ్..గ్రోత్ పాత్...ఈ దిశగా సాగుతున్న గమనంలో కంపెనీ మార్కెట్ షేర్ కూడా 7శాతంగా ఉంది

బ్రోకరేజీల విభాగంలో ఈ వాటా డీసెంట్‌గానే చూడాలి..ఐతే సంస్థ మాత్రం సరైన సమయంలోడీలిస్ట్ చేసి

ఈ కొత్త విభాగంలో వ్యాపారాన్ని బహుముఖాలుగా విస్తరించాలని నిర్ణయించినట్లు  చెప్తోంది. కోవిడ్ దెబ్బ పడగానే

క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ భారీగా పెరిగాయి. వెంటనే ఐసిఐసిఐసెక్యూరిటీస్..డెరివేటివ్ సెగ్మెంట్ నుంచి లోన్లు, వెల్త్ మేనేజ్‌మెంట్

వైపు దృష్టి సారించింది. కంపెనీ దేశంలోని టాప్ 5 బ్రోకరేజ్ కంపెనీల్లో ఒకటిగా ఉంది కూడా..!


కంపెనీ ఓవరాల్ రెవెన్యూతో పోల్చితే క్యాష్ ఈక్విటీబ్రోకింగ్ 20శాతానికి తగ్గించుకుంది. అంతకి ముందు ఐదేళ్లు ఇది 50శాతంగా ఉఁడేది

గత ఏడు క్వార్టర్లుగా డెరివేటివ్స్ విభాగం రెవెన్యూ పెరుగుతోంది. మొత్తం ఆదాయంలో వీటి వాటా 15శాతం. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం 19 నుంచి

22శాతానికి గత ఏడాదికాలంలో పెరిగింది.


దీనికి తోడు కంపెనీకి చేతిలో రూ.6790కోట్లు క్యాష్..క్యాష్ ఈక్వివేలంట్ సొమ్ము రెడీగా ఉంది. షేరు ఫార్వార్డ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 

11రెట్లుగా ఉంది. ఇతర లిస్టెడ్ కంపెనీలకంటే ఎక్కువగా..ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రిటన్ ఆన్ ఈక్విటీ 42శాతంగా నమోదు అయింది. ఐనా సరే

ఏ బ్రోకరేజ్ కంపెనీ కూడా ICICI సెక్యూరిటీస్ స్టాక్‌ని రీ రేట్ చేయడం లేదు..అందుకే ప్రమోటర్లు దీన్ని డీలిస్ట్ చేసి..సరైన వేల్యూ క్రియేట్ చేయబోతున్నారనే

టాక్ నడుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కి సెక్యూరిటీస్ సంస్థలో 74.85శాతం వాటా ఉంది


తొందర్లోనే హై మార్జిన్ ప్రొడక్ట్స్‌ని ICICI సెక్యూరిటీస్ తన పోర్ట్‌ఫోలియోలో మిక్స్ చేస్తుందని..కంపెనీకే చెందిన మరో సంస్థ ఫిస్డమ్ హెడ్ రీసెర్చ్ నీరవ్ కర్కేరా

చెప్తున్నారు. మరోవైపు బ్యాంక్ కేపిటల్ ఎక్స్‌పాన్షన్‌కి కూడా డీలిస్టింగ్ సాయపడుతుందని చెప్తున్నారు. బ్యాంక్‌తో కలిసిపోయిన తర్వాత ఎర్నింగ్స్ కన్సాలిడేషన్

జరగడమే కాకుండా..వేల్యేషన్ కూడా చక్కగా కుదురుతందని..ఓవరాల్‌గా ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఉబ్బితబ్బిబ్బవుతుందని ఇదే రంగానికి చెందిన

కొందరు చెప్తున్నారు. ఐతే షేర్ స్వాపింగ్ ప్రాసెస్ అంత తొందరగా పూర్తయ్యేది కాదని గత అనుభవాల దృష్ట్యా తెలుస్తోంది. దీనికి షేర్ హోల్డర్లు, సెబీ, ఎక్స్‌ఛేంజ్

సిసిఐ వంటి అనేక సంస్థల ఆమోదం పొందాల్సి ఉంటుంది


నిన్నటి వరకూ 11శాతం లాభపడిన  ఐసిఐసిఐ సెక్యూరిటీస్..ఇవాళ్టి ట్రేడింగ్‌లో ( జూన్ 27) రెండున్నరశాతం నష్టంతో..రూ.605 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments