MOIL ర్యాలీ...కారణముంది చూడండి

 మోయిల్ హ్యాట్రిక్ కొట్టింది. మ్యాంగనీస్, ఐరన్, ఓర్ ప్రొడక్షన్‌లో నంబర్ వన్ 

కంపెనీ అయిన ఈ మినీరత్న సంస్థ..వరసగా మూడో రోజు కూడా మార్కెట్లలో

లాభాలను పంచుతోంది. మే నెలలో చక్కని అమ్మకాలు సాధించడమే ఈ జోరుకు

దోహదపడగా..జనవరి-మార్చి మధ్యలో ఆర్థిక ఫలితాలు కూడా మరో కారణంగా చెప్పాలి



మే నెలలో MOIL లక్షా53వేల టన్నుల మాంగనీస్ ముడి ఖనిజం ఉత్పత్తి చేసింది.

ఇది గత ఏడాది మేతో పోల్చితే 43శాతం ఎక్కువ. అలానే సేల్స్ చూస్తే..72శాతం పెరిగి

లక్షా53వేల టన్నుల ఖనిజం అమ్మగలిగింది.


గత మూడురోజుల్లో స్టాక్ 5శాతం పెరగగా, ఇవాళ ఇంట్రాడేలో 5 శాతం ర్యాలీ చేసి రూ.166కి చేరింది

తర్వాత వెనక్కి తగ్గి రూ.161-162 మధ్య ట్రేడవుతోంది.

కేవలం రూ.3294కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ఉన్న ఈ మినీరత్నలో చాలా పొటెన్షియల్ 

ఉందనేది ఎక్కువమంది చెప్పేమాట. ఐతే సరైన అమ్మకాల ప్రణాళిక లేక..ఇలా తక్కువ రేటులో ట్రేడవుతుంటుందనేది

కూడా చెప్తుంటారు. ఎందుకంటే దేశంలోని మాంగనీస్ అవసరాల్లో 45శాతం ఈ సంస్థనే సమకూర్చుతుంటుంది. ఐతే

ఈమధ్యనే మ్యూచువల్ ఫండ్స్ తమ హోల్డింగ్స్‌ని ఈ సంస్థలో తగ్గించుకుంటూ వచ్చాయ్. అంతకి మించిన బ్యాడ్ న్యూస్

ఏదీ ప్రస్తుతానికి ఈ సంస్థవరకూ లేదు..!


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి MOIL షేర్లు రూ.162.10 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments