ఈ వారం చూడాల్సిన విషయాలు

 -------

యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, ఉద్యోగ నియామకాలు తక్కువగా ఉండటంతో మళ్లీ ఫెడ్ రానున్న పాలసీ సమావేశంలో రేట్ల పెంపుకు వెళుతుందనే సూచనల మధ్య మార్కెట్లు గతవారం ర్యాలీని కొనసాగించాయి. ఇదే క్రమంలో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లలో తాజా రికార్డు గరిష్ఠాలు నమోదు కావటం దిశగా ఇటీవలి పదునైన ర్యాలీ వెనుక ఎఫ్‌ఐఐల పెట్టుబడి ప్రవాహాలు పెద్ద చోదక శక్తిగా నిలిచాయి. దీనికి తోడు సానుకూల ఆర్థిక గణాంకాలు, జూన్ త్రైమాసిక ఆదాయాల కంటే ముందు కార్పొరేట్ల ఫైనాన్సియ్ డేటా, విదేశీ పెట్టుబడులతో మన మార్కెట్లు ఊపందుకున్నాయి


రానున్న వారంలో అడపాదడపా కన్సాలిడేషన్, యుఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ డేటా, క్యు1 ఎర్నింగ్స్ చూడాలి


ఐతే మార్కెట్లు మెుమెంటంను కొనసాగిస్తాయని బ్రోకరేజ్ మోతీలాలా ఓస్వాల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే దేశీయ, అమెరికా ద్రవ్యోల్బణం డేటా మార్కెట్ల ట్రెండ్ నిర్ణయానికి దోహదపడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రానున్న వారంలో మార్కెట్లను 10 అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. మెుదటగా కార్పొరేట్ కంపెనీలు విడుదల చేసే తమ నూతన ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలు. రెండవది జూన్ మాసానికి సంబంధించిన సీపీఐ ద్రవ్యోల్బణ డేటా. మూడవది అమెరికా ద్రవ్యోల్బణ సమాచారం. అలాగే ఇతర గ్లోబల్ ఎకనామిక్ డేటా చైనా, జపాన్, యూరప్ లకు సంబంధించినది. అలాగే ఎఫ్ఐఐల పెట్టుబడులు, ఇండియా విక్స్ సూచీ, ఐపీవోల లిస్టింగ్ పనితీరు, కార్పొరేట్ యాక్షన్స్, ఎఫ్ అండ్ ఓ సూచనలు వంటివి ప్రధానంగా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.


Comments