ఫోన్ కొట్టేశాడు..కంప్లైంట్ ఇద్దామని పోతుంటే బైక్ కూడా..!

ఫోన్ కొట్టేశాడు..కంప్లైంట్ ఇద్దామని పోతుంటే బైక్ కూడా..!

పూణేలో ఓ తమాషా దొంగతనం(యజమానికి కడుపు మండేది) చోటు చేసుకుంది. 29ఏళ్ల ఓ వ్యక్తి

తన ఫోన్ పోయిందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు..ఇంతలో అతని బైక్ కూడా కొట్టేశారు

అతనికి వచ్చిన ఈ కష్టం ఎలాంటిదంటే..జనం పగలబడి నవ్వుకునేది 


రెండు సంఘటనల్లో కూడా నేరగాళ్ల నుంచి మరొకళ్లకి సాయం చేయబోయి అతను తన వస్తువులు పోగొట్టుకున్నాడు

పైగా ఇతడు పూణేకి కొత్తగా వచ్చాట్ట. నగరంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, ఓ మనిషి వచ్చి తనకి బుల్ధానాకి

టిక్కెట్ బుక్ చేయమని అడిగాడట. మన పరోపకారి పాపన్న యుపిఐ ద్వారా రూ.500 పంపించి..వేరే కాల్ చేసుకోవాలని అడిగితే

ఫోన్ చేతికి ఇచ్చాట్ట..వెంటనే ఆ వచ్చిన వ్యక్తి దాంతో ఉడాయింస్తుండగా షాక్ తిని చూస్తుండిపోయాడు


ఆ తర్వాత తనకి జరిగిన ఈ ఘోరం గురించి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసేందుకు మరో వ్యక్తిని సాయం చేయమనగా..ఈ ఇంకో రెండో కేటుగాడు తనకి పోలీసులు చాలామంది తెలుసంటూ బైక్ ఎక్కి..బైల్దేరాడు..ఐతే ఇక్కడ  అతగాడు మరో కండిషన్ పెట్టాట్ట..నాకో సిగరెట్ ఇస్తే..వస్తా అన్నాడట..ఇక్కడ ఏం జరిగిందో నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా...మనోడు ఆ సిగరెట్ తీసుకురావడానికి వెళ్లడం రెండో కిలాడీ బైక్ తో జంప్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయ్


భోసారి అనే పోలీస్ స్టేషన్‌లో ఈ పరోపకారి పాపన్న కంప్లైంట్ చేయగా..అసలు పేరు బైటపెట్టవద్దని కోరాట్ట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది

మనోడు మొదటి మోసగాడికి పంపింది రూ.500 అనుకున్నాడు కానీ..అసలు ట్రాన్స్‌ఫరైంది రూ.3వేలు..

ఇప్పుడు చెప్పండి ఇది చదువుతుంటే మీకు నవ్వు రావడం లేదా..?


మన మొహాన  రండి బాబూ రండి మోసగించబడటానికి నేను రెడీ  అని రాసిపెట్టుకుంటే..మోసగించడానికి జనాలు తక్కువా..

తస్మాత్ జాగ్రత్త..!



Comments