12 క్వార్టర్ల తర్వాత నష్టం..డిమార్ట్ వేల్యేషన్..కన్సర్న్?



డిమార్ట్‌లో షాపింగ్ చేయని సిటిజనులు ఉండరు..ఎందుకంటే..మార్కెట్లలో తక్కువరేటుకు ఉత్పత్తులు విక్రయించే ఓ భాండాగారంగా డిమార్ట్‌కి పేరు.దానికి తగినట్లుగానే..రోజులో ఫలానా సమయం అని లేకుండా ప్రతి గంటా భారీగా రద్దీ చోటు చేసుకుని ఉంటుందిక్కడ..! 


ఇప్పుడు తొలిసారిగా అంటే..12 క్వార్టర్ల తర్వాత లాభాల్లో తగ్గుదల నమోదు చేసింది.

నికరలాభంలో 9.2శాతం క్షీణతతో సెప్టెంబర్ క్వార్టర్‌లో 623 కోట్ల లాభానికి పరిమితమైంది. 

హై బేస్ ఎఫెక్ట్ కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకోగా, ఆపరేషనల్ రెవెన్యూ 18.67శాతం పెరిగి రూ.12624కోట్లకి చేరింది

మొదటిసారిగా..తక్కువమంది కస్టమర్లు రావడం..అలానే జనలర్ మర్కండైజే కేటగరీలో సేల్స్ తగ్గడం నమోదైందని తెలుస్తోంది. 


దీంతో..స్టాక్ వేల్యేషన్‌ని ఓసారి గమనించాలని ఎక్కువమంది అనలిస్టులు చెప్తున్నారు


107x ఎర్నింగ్స్..ఉన్న రేటు చూస్తే..ఆర్థిక పనితీరు అంచనాలను అందుకోవడం కష్టమని అనలిస్టులు చెప్తుండగా, కోటక్, సిటీ రెండూ స్టాక్‌పై సెల్ రేటింగ్స్ ఇచ్చాయ్.  ట్రెండ్‌లైన్ ప్రకారం, స్టాక్‌పై రూ. 4,065 యావరేజ్ రేటు కాగా..శుక్రవారం నాటి క్లోజింగ్ రేటు నుంచి ఇది 3.30 శాతం మాత్రమే అప్‌సైడ్ పొటెన్షియల్ సూచిస్తోంది. ఇక ఫారిన్ బ్రోకరేజ్ కంపెనీ  జెఫరీస్  స్టాక్‌‌కి  తన హోల్డ్ రేటింగ్‌ను మెయిన్ టైన్ చేస్తూ..టార్గెట్ ప్రైస్ రూ. 3,700 నుండి రూ. 3,850కి పెంచింది


ఈ అంచనాలను గమనించిన తర్వాత..కొన్ని రోజులు డిమార్ట్ స్టాక్ డౌన్‌ట్రెండ్ పట్టవచ్చనేది అర్థమవుతోంది

Comments