7% క్రాషైన ఇన్పోసిస్ ఏడిఆర్‌లు..రిజల్ట్స్ బావున్నా..తప్పని పతనం..వీక్ గైడేన్సే కారణం గురువా



  •  ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కాస్త సర్‌ప్రైజ్ ఇచ్చాయనే చెప్పాలి. సాయంత్రం విడుదల చేసిన 2024 రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి మరీ కాస్త బెటర్ రిజల్ట్స్‌గా చెప్తున్నారు. క్యు2లో రూ.6212కోట్లలాభం  రూ.38994 కోట్ల ఆదాయం గడించింది ఇన్ఫోసిస్..! సీక్వెన్షియల్‌గా ఈ లాభం 3.07శాతం ఎక్కువ. అలానే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 3.17శాతం ఎక్కువ

  • కాన్‌స్టంట్ కరెన్సీ 2.5శాతంగా ఉండగా..ఆపరేటింగ్ మార్జిన్ 21.2శాతంగా నమోదైంది. ఇక టోటల్ కాంట్రాక్ట్ వేల్యూ చూస్తే..7.7 బిలియన్ డాలర్ల డీల్స్‌ని జులై-సెప్టెంబర్ మధ్యలో ఇన్ఫోసిస్ దక్కించుకుంది. 

  • మధ్యంతర డివిడెండ్‌గా షేరుకు రూ.18 అనౌన్స్ చేసింది.గైడెన్స్ చూస్తే..ఈ నడుస్తున్న సంవత్సరంలో ఆదాయం కరెన్సీపరంగా 1-2.5శాతం మధ్యలో ఉంటుందని అంచనా కట్టింది ఇన్ఫోసిస్...!

  • ఉద్యోగుల సంఖ్య ఏకంగా 7530మంది తగ్గడం ఓ షాక్.. హెడ్‌కౌంట్ తగ్గడం వరసగా మూడో క్వార్టర్‌లో ఇలా జరగడం గమనించాలి

  • గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ 2.82శాతం నష్టంతో రూ.1452.30 దగ్గర క్లోజ్అయింది
  • మరోవైపు అమెరికాలో లిస్టైన ఏడిఆర్స్ ప్రస్తుతం 7శాతం క్రాష్ కావడం కూడా గమనించాలి. సో..రేపటి ట్రేడింగ్‌లో ఈ అంశం ఎలా పరిణమిస్తుందో చూడాలి

Comments