ఈ రోజు ఫ్లాట్..దెబ్బేసిన ఐటి..సర్ ప్రైజ్ చేసిన ఇన్ఫీ

 


మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయ్. కానీ టెక్ జెయింట్ ఇన్ఫోసిస్ అంచనాలను తారుమారు చేయడంతో రేపు మంచి స్వింగ్ నమోదు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయ్. ఈ రోజే నిన్నటి క్లోజింగ్ కంటే గరిష్టాన్ని తాకినా ఒడిదుడుకుల మధ్య 17 పాయింట్లు నష్టపోయి 19794 పాయింట్ల దగ్గర నిలిచింది


సెన్సెక్స్ 65 పాయింట్లు కోల్పోయి 66408 పాయింట్ల దగ్గర సెటిలైంది. ఐటీ సెక్టార్ భారీగా నష్టపోవడమే ఈ నష్టాలకు కారణంగా చెప్పొచ్చు..అలానే మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఆ నష్టాలను కాస్త బ్యాలెన్స్ చేశాయ్. 

BPCL,కోల్ఇండియా మారుతి సుజికి, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ ఒకటి నుంచి రెండుశాతం లాభపడగా, టెక్ మహీంద్రా, అపోలో హాస్పటల్, ఇన్ఫోసిస్ టిసిఎస్, హెచ్‌సిఎల్‌టెక్ ఒకటి ముప్పావు నుంచి రెండుముప్పావుశాతం వరకూ నష్టపోయాయ్..ఈ టాప్ త్రి ఐటి కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చేసినవే కావడం గమనించాలి 

Comments