ఫ్లాట్ మార్కెట్లు..మెటల్స్ మెరుపుల్

 స్టాక్ మార్కెట్లు పండగ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించాయ్. నిఫ్టీ 19750 పాయింట్లకి అటు ఇటూగా ట్రేడవుతుండగా సెన్సెక్స్ ఓ పాతిక పాయింట్లు నష్టపోయింది. 66250 పాయింట్లపైన ట్రేడవుతోంది


కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్,పిఎస్ఈ స్టాక్స్‌లో పావుశాతం నుంచి అరశాతం వరకూ లాభం కన్పిస్తుండగా మెటల్ స్టాక్స్ ముప్పావుశాతం లాభపడ్డాయ్. ఇక ఐటి సెక్టార్ పాజిటివ్‌గా చాలా పరిమిత స్థాయిలో కదలాడుతుండగా, బ్యాంక్ నిఫ్టీ పావుశాతం నష్టపోయింది


హెచ్‌సిఎల్ టెక్, యుపిఎల్, ఎల్‌టిమైండ్‌ట్రీ, హీరోమోటోకార్ప్, కోల్ఇండియా ఒకటిన్నరశాతానికిపైగా లాభపడి టాప్ 5 గెయినర్లుగా ట్రేడవుతున్నాయ్

నెస్లే,దివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్,ఇండస్ఇండ్ బ్యాంక్ అరశాతం నుంచి ఒకటిముప్పావుశాతం నష్టపోయాయ్


Comments