భరించలేని ఉత్పాతం..కళ్ల ముందు కూలుతున్న స్టాక్స్


స్టాక్ మార్కెట్ల సైపలేనంత నష్టాలను చవిచూపిస్తున్నాయ్. నిఫ్టీ ఈరోజు ఇంట్రాడేలో లంచ్ కంటే ముందుగానే 280 పాయింట్లు నష్టపోయింది. ఇది ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ ఫాల్..ఇంతగా మార్కెట్లను

ముంచుతున్నది ఏమిటంటే..ఒక్క ఇజ్రాయెల్ -హమాస్ పై ప్రకటించిన యుద్ధమే..ముందుగా ఇజ్రాయెల్‌పై

ఈ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలోనే మనం యాప్‌లో ఓ స్టోరీలో హెచ్చరించాం..ఇది చాలా దీర్ఘకాలంలో

భారీ ఎత్తున ప్రభావం చూపే పరిణామం అని.


అది నిజమైనందుకు దిగాలు పడాల్సిందే, ఎకాఎకిన స్టాక్ మార్కెట్లు 2023 ఫిబ్రవరి స్థాయికి పతనం అయ్యాయ్.

.ఇవాళ్టి పతనం వెనుక యుద్ధప్రభావంతో పాటు, అక్టోబర్ సిరీస్ ఎక్స్‌పైరీ కూడా

మరో కారణం.ఇది ఇక్కడితో ఆగేలా కన్పించడం లేదు. ఎందుకంటే నిఫ్టీ కనుక 18800 దిగువకి పడితే..మరో 300 పాయింట్ల పతనం తప్పదని దినేష్ నాగ్‌పాల్ లాంటి టెక్నికల్అనలిస్టులు భయపెడుతున్నారు..లాంగ్ టర్మ్ లేదంటే

హోల్డింగ్ కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్లు వీటికి తత్తరబిత్తర పడరు కానీ..ఏదో 20శాతంలాభంతో ఉన్నవాళ్లు ,షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవాళ్లు ఖచ్చితంగా అమ్మకాలకు దిగుతారు..ప్రస్తుతానికి ఉన్న లాభం

చాలనుకుని..బైటపడే కేసులూ ఎక్కువే ఉంటాయి..


వరసగా ఆరో రోజు కూడా పతనం కావడంతో..విప్రో,టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే.డా.రెడ్డీస్ భారీగా నష్టపోయాయ్


ఇక ఎన్నాళ్ల్లుగానో ఎదురుచూస్తోన్న స్మాల్‌క్యాప్ సెక్టార్ సెల్లింగ్ ఇప్పుడు చోటు చేసుకుంది. ఎప్ఎంసిజి మినహా ప్రతి రంగం ఒకటిన్నరశాతం పతనం అయింది


వార్ క్రైసిస్‌ పెరిగేకొద్దీ ఈ అమ్మకాలు ఎక్కువ అవుతాయ్.ఓ వైపు బాండ్ల రాబడి పెరగడం..ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ లేపేసి..బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎక్కువఅవుతుంది. క్రూడాయిల్ రేటు పెరుగుతుంది.ఇవన్నీలేటరల్,కొల్లేటరల్ 

డ్యామేజీలు..

Comments