ఇన్ఫోసిస్ కి గైడెన్స్ ఎఫెక్ట్

 



గైడెన్స్ కట్ చేయడంతో...ఇన్ఫోసిస్ షేర్లు ఇవాళ మార్కెట్లలో నాలుగున్నర శాతం వరకూ

నష్టపోయాయ్. గ్రోత్ గైడెన్స్ రాబోయే క్వార్టర్లలో లోయర్ సింగిల్ డిజిట్లకే పరిమితం చేస్తూ

మేనేజ్‌మెంట్ కామెంటరీ నిన్నటి రిజల్ట్స్ మీటింగ్‌లో ఇచ్చింది ఇన్పోసిస్..! దాని ప్రభావంతో

మార్కెట్లలో ప్రతిఫలించింది


ఇన్పోసిస్ ఇంట్రాడేలో రూ.1400 ధరకి దిగింది. అంతకి ముందు అమెరికా ఏడిఆర్‌లు 

7శాతం పతనమైన సంగతి మనం చెప్పుకున్నాం..బహుశా ఆ ప్రభావం కూడా పని చేసి ఉండొచ్చు



మంచి ఫలితాలే ప్రకటించినా, భవిష్యత్‌పై బెంగ ట్రేడర్లు, ఇన్వెస్టర్లను తాత్కాలికంగా వేధించినట్లు

ఈ అమ్మకాలు చెప్తున్నాయ్. స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ఇన్ఫోసిస్ షేర్లు రూ. 1422.50 దగ్గర 3శాతం నష్టంతో ట్రేడ్ అయ్యాయ్

Comments