140కోట్లడాలర్ల భరణం కోరుతోన్న భామ్మ



రేమండ్స్ ఛైర్మన్ గౌతం సింఘానియా లాస్ట్ వీక్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు కదా..ఇప్పుడాయన్నుంచి

నవాజ్ మోడీ 1.4 బిలియన్ డాలర్ల భరణం కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇది మొత్తం గౌతం సింఘానియాఆస్తిలో 

75శాతంగా  చెప్తున్నారు. 


తన కూతుళ్లు నీహారిక,నీసా సింఘానియాలతో పాటు..తనకి కూడా ఇది ఫ్యామిలీ సెటిల్‌మెంట్ కింద ఇవ్వాలనేది ఆమె డిమాండ్

దీనికి గౌతం సింఘానియా కూడా అంగీకరించారట..ఐతే..మొత్తం ఆస్తినంతా ఓ ఫ్యామిలీ ట్రస్ట్‌కింద కన్వర్ట్ చేసి తన మరణానంతరం ఇతర

కుటుంబసభ్యులకు ఆ ఆస్తిపై హక్కు దక్కేలా ట్రస్టీలుగా ఏర్పాటు చేస్తానని చెప్పాట్ట..ఇది మాత్రం నవాజ్ మోడీకి ఇష్టంలేదని..ఈ ప్రతిపాదన

తిరస్కరించినట్లు చెప్తున్నారు



ఈ విడాకుల భాగోతానికి హయగ్రీవ్ ఖేతాన్..లీగల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తుండగా, రష్మీకాంత్ అనే మరో లాయర్ నవాజ్ మోడీ తరపున

రంగంలోకి దిగారట.

Comments