మనం చెప్పిందే నిజమైంది..నిఫ్టీ 20వేలు దాటేసింది మరోసారి

 మార్కెట్లు ఉదయం అంచనా వేసినట్లే ట్రేడ్ అవుతున్నాయ్. నిఫ్టీ 47 సెషన్ల తర్వాత 20వేల పాయింట్ల మార్క్ తిరిగి అందుకుంది

సెన్సెక్స్ 66590 పాయింట్ల వరకూ పెరిగింది. 425 పాయింట్లు లాభపడింది


ఐటీ సెక్టార్ ఒకటీన్నరశాతం ర్యాలీ చేయగా,బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభపడింది

ఆటో వింగ్ ఒకశాతం ,కేపిటల్ గూడ్స్ అరశాతం లాభంతో మార్కెట్లకు మద్దతు ఇస్తున్నాయ్.ఆయిల్ అండ్ గ్యాస్ వరసగా రెండో సెషన్ కూడా దంచి కొడుతున్నాయ్, మెటల్ స్టాక్స్ ఫ్లాట్‌గా ఉన్నాయ్.హెల్త్ కేర్ సెక్టార్ కూడా అరశాతానికిపైగా ర్యాలీ చేయగా..అన్ని రంగాలూ లాభాలతోనే ట్రేడవుతున్నాయ్


హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం వరకూ లాభంతో టాప్ 5 గెయినర్లుగా నిలవగా, ఓఎన్‌జిసి, బిపిసిఎల్, కోల్ఇండియా ఎన్‌టిపిసి, డా.రెడ్డీస్ ల్యాబ్స్ పావు నుంచి అరశాతం వరకూ నామమాత్రపు నష్టంతో ట్రేడవుతున్నాయ్

Comments