భారీ ర్యాలీ తర్వాత అలుపు..20వేలపాయింట్లపైనే నిఫ్టీ

 స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ ర్యాలీ తర్వాత కాస్త అలుపు 

తీర్చుకుంటున్నాయ్. నిఫ్టీ ఇవాళ ఇంట్రాడేలో 20136 పాయింట్లకు

చేరి 20015 పాయింట్లకు జారింది. 



సెన్సెక్స్ 67వేల పాయింట్లను తాకిన అనంతరం 66610 పాయింట్లకు

పతనం అయింది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. హెల్త్ కేర్ 

సెక్టార్ ముప్పావుశాతం లాభపడగా, ఆటో స్టాక్స్ కొద్దిపాటి నష్టంతోట్రేడవుతోంది. 

మెటల్,పిఎస్ఈ స్టాక్స్ సోసోగా ట్రేడ్ అవుతున్నాయ్


హీరోమోటోకార్ప్, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటిన్నర నుంచి రెండుంబావు శాతం లాభపడగా, టాటా మోటర్స్, అదానీ

ఎంటర్‌ప్రైజెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ముప్పావు నుంచి

ఒకటిన్నరశాతం వరకూ నష్టపోయాయ్

Comments