వాటే వండర్..అద్భుతం..ఆ 41మంది బతికారు

రేపో మాపో ఈ సంఘటనపై ఖచ్చితంగా సినిమాలు వస్తాయ్. కొన్నాళ్ల తర్వాత

సిరీస్‌లు కూడా తీస్తారు..ఉత్తరకాశీలో సొరంగం కూలిపోయిన ఘటనలో 41మంది కూలీలు

అక్కడే భూగర్భంలో చిక్కుకుపోయిన ఘటనలో అందరూ క్షేమంగా బయటకు వచ్చారు..కాదు కాదు రెస్క్యూటీమ్ తీసుకువచ్చింది



ఇది నిజంగా అద్భుతమే 


ఎన్నికల హడావుడిలో పెద్దగా ఛానళ్లకి దీనిపై ఆసక్తి కలగలేదు కానీ..మన టెక్నాలజీ సత్తా ప్రపంచస్థాయికి మించిందని కూడా చెప్పాల్సిన సంఘటన ఇది. ఈ పదిహేడు రోజులు..వారి కుటుంబసభ్యులకు ఎంత వేదన..దిగులు..అనుభవించి ఉంటారో

వర్ణించలేం. అంతా ఈ రోజు రాత్రి 8 గంటలకు టన్నెల్ బైటికి వారంతా విడతలవారీగా రాగానే ఒక్క చేత్తో తీసేసినట్లు అయిపోయి ఉంటుంది


వీరందరి కోసం 41 బెడ్లతో కూడిన ఓ వార్డ్ ఏర్పాటు చేసి..అక్కడ మెడికల్ చెకప్..ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు..


నవంబర్ 12న వీళ్లని బైటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా టన్నెల్ లోని కొంత భాగం కూలిపోవడంతో..ఒక్కసారిగా పెద్ద అఘాతం కలిగింది

ఐతే మొక్కవోని దీక్షతో..రకరకాల ప్రయత్నాలు చేస్తూ..వారికి ధైర్యం చెప్తూ..మానసికంగా కొలాప్స్ కాకుండా చూసారు. ఆరు అంగుళాల మందంఉన్న పైప్ ని

ఈ సొరంగంలో చిక్కుబడ్డ చోటకి పంపి..మందులు..ఆహార పదార్ధాలు పంపడం..దాంతో వారు ఇన్నాళ్లూ బతకడమనేది..దైవ ఘటన..అలానే చివరి వరకూ

ప్రయత్నిస్తూనే ఉఁడాలనే గొప్ప పోరాట సూత్రం కూడా ఇక్కడ ఎంతో పని చేసింది



Comments