బైజూస్‌పై తీవ్రమైన ఆరోపణలు..9వేలకోట్ల మేర నిబంధనల అతిక్రమణ

 

బైజూస్‌పై తీవ్రమైన ఆరోపణలు..9వేలకోట్ల మేర నిబంధనల అతిక్రమణ

అసలే ఆర్థికనష్టాలతో అల్లాడుతున్న బైజూస్‌పై ఇప్పుడు మరో దెబ్బ పడింది

దాదాపు 9వేల కోట్ల రూపాయలను ఫెమా నిబందనలకు విరుద్ధంగా కనుగొన్నట్లు

చెప్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈ మేరకు నిర్థారణకు వచ్చిందని..ఐతే ఇంతవరకూ

కంపెనీకి నోటీసులు మాత్రం పంపలేదని సమాచారం


ఐతే బైజూస్ మాత్రం ఈ సమాచారాన్ని ఖండించింది. 


2011-23 మధ్యలో బైజూస్ కి ఓవర్సీస్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రాగా..పది విదేశీ సంస్థలు

పెట్టుబడులు పెట్టాయి. కేమాన్ ఐలండ్స్ అనే సంస్థ పెట్టిన పెట్టుబడిపై ఇప్పటికే విచారణ సాగుతోంది

అలానే సుమేరు వెంచర్స్, విట్రువియాన్ పార్టనర్స్, బ్లాక్‌రాక్ పెట్టుబడులపైనా

వివరణ ఇవ్వాల్సి వస్తుందని ప్రస్తుతం తెలుస్తోంది


మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్, డైరక్టరేట్ ఆఫ్ జిఎస్టీ ఇంటలిజెన్స్  శాఖలు కూడా బైజూస్

పెట్టుబడులపై ఇప్పటికే ఆరా తీస్తున్నాయ్. ఇప్పుడు ఈడీ కూడా ఈ పెట్టుబడులపై

దర్యాప్తు చేస్తోంది. ఓ వేళ సంతృప్తికరమైన వివరణ దొరకని పక్షంలో ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్‌మెంట్

యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం చోటు చేసుకోవచ్చు

Comments