మెల్లగా..మెల్లగా..కదులుతోన్న మార్కెట్లు, దంచికొట్టేసిన అదానీ

 స్టాక్ మార్కెట్లు మంగళవారం కొద్ది లాభంతో ప్రారంభించి..అలానే ట్రేడవుతున్నాయ్

నిఫ్టీ 19850 పాయింట్ల వరకూ పెరగగా,సెన్సెక్స్ 66098 పాయింట్ల వరకూ వెళ్లింది. ఈ రెండు లెవల్స్ దగ్గరకే గత శుక్రవారం కూడా ఇండెక్స్‌లు వెళ్లడం విశేషం.



బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా,ఐటి ఇండెక్స్ అరశాతం నష్టంతో..ట్రేడవుతుండగా,ఆటోస్టాక్స్

అరశాతానికిపైగా లాభపడ్డాయ్. పిఎస్ఈ సెక్టార్ కూడా ఒకశాతం వరకూ లాభపడగా

ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అదరగొడుతోంది. ఏకంగా రెండున్నరశాతం  ఈ విభాగపు షేర్లు లాభపడ్డాయి


అదానీ ఎంటర్‌ప్రైజెస్, బిపిసిఎల్, అదానీ పోర్ట్స్,, టాటా మోటర్స్ హిందాల్కో ఒకటిన్నర నుంచి ఆరున్నర శాతం వరకూ లాభపడ్డాయి. అపోలో హాస్పటల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌సిఎల్ టెక్, టెక్‌మహీంద్రా సిప్లా అరశాతం నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్

Comments