పటాన్‌చెరులో చరిత్ర సృష్టించబడుతుందా..ఈ యువనాయకుడు ఎమ్మెల్యేఅయితే..!



 చాలా రోజుల నుంచి మిత్రుడు మల్లిఖార్జున్ చెప్తున్నా..వాయిదా పడుతూ ..లేదు వాయిదా వేసాను

కానీ ఈ రోజు ఉదయం మాత్రం నీలం మధు అనే పొలిటీషియన్‌ని కలిశాను. ఉదయం వారి ఊరికి వెళ్లాం.అక్కడ ఎవరిని అడిగినా..వారిల్లు..తోట అడ్రస్ చెప్తున్నారు..మేం వెళ్లేసరికే..దాదాపు 100మంది వరకూ ఉన్నారు.కార్యకర్తలో..అభిమానులో..ఇంకెవరైనా కావచ్చు..వేరే ఏదో మాట్లాడుతున్నారు అని వారి సిబ్బంది చెప్పారు


ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడాడు. ఆస్సైరింగ్...ఎలాగైనా..తాను ఓ రాజకీయబరిలో నిలవాలన్న తపన కన్పించింది. బిఆర్ఎస్‌లో టికెట్  ఇవ్వకపోవడం..కాంగ్రెస్‌లో ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం, దాదాపు ప్రతి చోటా ఇదే విషయాన్ని

ఆయన వివరిస్తుంటే..నాకనిపించింది ఏమిటంటే..అలా చేయడమే ఇలా ఇంత బలంగా పోటీలో నిలబడటానికి కారణమని..!


బరిలో తనకి టిక్కెట్ ఇచ్చిన పార్టీ BSP మేనిఫెస్టోతోపాటు తనకంటూ ఓ సొంత మేనిఫెస్టో కూడా తయారు చేసుకోవడం కూడా ఆయన తపనకి నిదర్శనం


చిట్కూరు గ్రామ సర్పంచ్ కూడా అయిన ఈ నీలం మదు ఉరఫ్ నీలం మధు ముదిరాజ్‌ని చూస్తే, కొన్ని ఆశలు..మరి కొంత వ్యక్తిగత లక్ష్యం, రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే తపన బలీయంగా ఉన్నట్లు అర్థమైంది. సరే ప్రెస్ మీట్ షరా మామూలుగా

లెంగ్తీగా సాగింది. మిత్రుడు మల్లిఖార్జున్ మధుని కలిసే ప్రయత్నంలో ఉండగానే నేను చొరవగా వెళ్లి రెండు మాటలు మాట్లాడటం ఆ తర్వాత ముగ్గురం కలిసి ఫోటో తీసుకున్నాం..అప్పుడనిపించింది. ఆయనకి పోటీ చేయడమే కాదు..గెలవాలన్న పట్టుదల

కూడా చాలా ఎక్కువగా ఉందని..మొత్తంగా పటాన్‌చెరు ఓటర్లు కనుక నీలం మధువైపు మొగ్గితే అదో చరిత్రే అవుతుంది..ఎఁదుకంటే ఎదురుగా ఉన్నది గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న పార్టీల నేతలు..కానీ యూత్, స్థానికులు మధువైపు మొగ్గుతారనడానికి సంకేతాలు

కూడా కన్పించాయి..ఎనీవే ఆల్ ది బెస్ట్ టు మధు

Comments