హై రిస్క్ లోన్లపై ప్రొవిజన్ కేటాయింపుతో ఆర్బీఐ కొరడా, మరిప్పుడు లాభపడే స్టాక్స్ ఏవి



 ప్రొవిజన్ల కేటాయింపులో భారీగా మార్పు బ్యాంకులు..నాన్ బ్యాంకింగ్ 

ఫైనాన్షియల్ కంపెనీలను ప్రభావితం చేస్తోంది. ఈ స్టాక్స్ శుక్రవారం

నష్టపోయాయ్. 


ICICI బ్యాంక్ 2శాతం నష్టపోయి రూ.924.50కి, HDFC బ్యాంక్ 1శాతం కోల్పోయి రూ.1489కి

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ 4శాతం నష్టంతో రూ.84.70కి పతనం అయింది

ఏయూ స్మాల్ పైనాన్స్ బ్యాంక్ ఒకటిన్నరశాతం నష్టపోయి తిరిగి అరశాతం లాభపడింది

SBI  ఇంట్రాడేలో 4శాతం వరకూ నష్టపోయి రూ.564కి వచ్చింది

యాక్సిస్ బ్యాంక్ ఇంట్రాడేలో మూడున్నరశాతం నష్టపోయి రూ.992.50 వరకూ దిగి వచ్చింది

ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు మాత్రం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ట్రేడవుతోంది


మరి సూక్ష్మంలో మోక్షంలాగా..ఈ సమయంలో కొన్నిస్టాక్స్

ఇదే రంగం నుంచి లాభం పొందేవీ ఉన్నాయ్..అవి కెన్‌ఫిన్ హోమ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్  ఫైనాన్స్ , యాప్టస్ వేల్యూ,హోమ్ ఫస్ట్ వంటి షేర్లు ఈ సమయంలో లాభం పొందవచ్చని అనలిస్టులు చెప్తున్నారు..బ్యాంకింగ్ రంగంలో ఈ కంపెనీలు

పూర్తి సెక్యూర్డ్ లోన్ల విభాగంలో పని చేస్తున్నాయి కాబట్టి..ఇకపై ఆ రంగంలో పెట్టుబడులు కూడా కాస్త పెరగవచ్చని మరి కొందరి అంచనా

Comments