పేరుకే ఇది మహారత్న..ఇన్వెస్టర్ల పాలిట పెద్ద బండ.. సెయిల్..ఇక లాభాల్లో బోటింగ్ చేస్తుందా



సెయిల్ కంపెనీ స్టాక్ గత కొద్దిఏళ్లుగా చడీ చప్పుడు లేకుండా

ఎవరి మెప్పుకి నోచుకోకుండా ఉండిపోయింది. ఐతే కంపెనీ

తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆదాయ,లాభాలు పెంచేదిశగా మార్గం వేసింది


అది రైల్వేకి సరఫరా చేసే స్టీల్ రేట్లు పెంచడం..!


అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ పేరుతో తయారయ్యే ఈ రకపు స్టీల్‌ని టన్నుకి 67500 రూపాయల చొప్పున వసూలు చేస్తుంది.  ఈ రేటు కేవలం రైల్వేకి సరఫరా చేసే ఉక్కుకే పరిమితం. 

UTS 90/KG/MM2 , 60KG/MM2కి పెంచబోయే రేటుని టన్నుకు 85,300 గాఉండొచ్చనేది చూచాయగా తెలుస్తోంది

ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలోనే సెయిల్ ఈ రేటు అడగగా..ప్రొవిజినల్ ప్రైస్ రూ.67500ని రైల్వే ఫిక్స్ చేసింది.ఈ మాట కంపెనీ డైరక్టర్ అనిల్ తుల్సానీనే స్వయంగా చెప్పారు. ఈ 67500 రేటు కూడా , 63500 నుంచి పెంచగా వచ్చినదే


సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.1305 కోట్ల లాభం గడించింది. అంతకి ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌లో సెయిల్ రూ.329కోట్లకిపైగా నష్టం మూటగట్టుకుంది


సెయిల్ స్టాక్ 2021లో 80ల స్థాయి నుంచి రూ.102 వరకూ పెరిగిందే తప్ప..పెద్దగా మెరుపులు మెరిపించింది లేదు. ఇప్పుడు రేటు  చూస్తే సేమ్ 80ల దగ్గరే కొట్టుమిట్టాడుతోంది. ఈ రేట్ల పెంపు ఏదైనా స్టాక్ మూమెంట్‌పై ప్రభావం చూపుతుందేమో చూడాలి

Comments