రైల్ వికాస్ నిగమ్‌కి రిజల్ట్ రియాక్షన్



రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్లు ఇంట్రాడేలో శుక్రవారం మూడున్నరశాతం వరకూ నష్టపోయాయ్. రేటు రూ.155.30పైసలకు దిగివచ్చింది

సెప్టెంబర్ క్వార్టర్‌లో నికరలాభం రూ.394.30కోట్లు ఆర్జించిన RVNL, నిరుడు ఇదేకాలంతో పోల్చితే 3.4శాతం, క్యు1 లాభంతో పోల్చితే 15శాతం

ఎక్కువ రాబడి రాబట్టగలిగింది

ఐతే ఆదాయం మాత్రం మార్జినల్‌గా మాత్రమే పెరిగి రూ.4914కోట్లు గడించింది. ఇది నిరుడితో పోల్చితే 6 కోట్లు మాత్రమే ఎక్కువ. ఐతే ఇతరత్రా ఆదాయం

మాత్రం 33శాతం పెరిగి రూ.396కోట్లకి ఎగసింది.ఎబిటా..ఐదున్నరశాతానికిపైగా తగ్గి రూ.298.30కోట్లకి పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే

స్టాక్ కాస్త నష్టపోతుందని అనలిస్టులు చెప్తున్నారు. 


ప్రస్తుత మార్కెట్ కండిషన్..వరసగా పెరుగుతూ వచ్చిన విధానం గమనించినప్పుడు RVNL వెరీ షార్ట్ టర్మ్..షార్ట్ టర్మ్‌లో బీభత్సమైన

ర్యాలీ చేయకపోవచ్చని చెప్తున్నారు. లాంగ్ టర్మ్‌లో మాత్రం RVNL షేర్లకి ఢోకా లేదనేది ఎక్కువమంది అనలిస్టుల అభిప్రాయం

Comments