ఏడ్చినట్లే ఉందనకండి..! ఇకపై దానికి కూడా అద్దెకి అందమైన అబ్బాయిలు


కలికాలంలో విపరీతమైన పోకడలకు అంతే ఉండదని కాలజ్ఞానసృష్టికర్తలు ఏనాడో చెప్పేశారు.ఐతే ఒక్కోటి బయటకి వచ్చేకొద్దీ ఆశ్చర్యంగా ఒకింత వింతగా కూడా అనిపించవచ్చు..అలాంటిదే ఈ హ్యాండ్సమ్ వీపింగ్ బాయ్స్ ఫర్ రెంట్

జపాన్‌లో ఆపీసుల్లో కన్నీళ్లు తుడవడానికి అంటూ ఓ బ్యాచ్ తయారైంది..ఈ కాన్సెప్ట్‌ని హిరోకి టెరాయ్ ( Hiroki terai) అనే వ్యక్తి తయారు చేసాడు..పైగా దీనికో రంగమంటూ కూడా ఏడ్చిందంట..టియర్ ఇండ్యూసింగ్ బిజినెస్ దాని పేరు. ఇకెమీసో బాయ్స్ పేరిట
ఓ 4400మందిని ఇలా ఏడిపించడానికి ఆ తర్వాత వాటిని తుడవ
డానికి టీమ్‌గా తయారు చేసాడు. దీనిపై ఓ బుక్ కూడా వచ్చింది. బిబిసిలో ఇంటర్వ్యూ ఇస్తూ.." జపాన్ వాసులకు కేవలం ఇంట్లోనే కాదు..బయట కూడా ఏడవడాన్ని కోరుకుంటున్నా..ఇలా చేస్తే..ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుందంటూ ముక్తాయింపునిచ్చాడు

ఇలా ఎమోషనల్‌గా బ్రేక్ అయినవారి కన్నీళ్లు తుడవడానికి , ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి కూడా ఓ ట్రైనింగ్ ఇచ్చాట్ట 

ఒక్కో హ్యాండ్సమ్ బాయ్ రేటు 7900 యెన్లు

ఈ ఇకెమీసో దాంషి పేరిట ఈ సర్వీసులు సాగుతుండగా...ఇలాంటివే జపాన్‌లో కొన్ని సక్సెస్ అయిన వెంచర్స్ కూడా ఉన్నాయిట..
వాటిలో నాన్ సెక్సువల్ కడ్లింగ్ సెషన్స్( శృంగారరహిత కౌగిలింతలు) రెంట్ ఏ ఫ్రెండ్ వంటి ట్రెండ్స్ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి

Comments