దంచికొట్టిన టాటా టెక్నాలజీస్..దద్దరిల్లిన రికార్డులు

 టాటా టెక్నాలజీస్ ఐపిఓ 140 శాతం ప్రీమియంతో లిస్టైంది. దీంతో పెట్టుకున్న అంచనాలను నిజం చేసినట్లైంది. స్టాక్ అలాట్‌మెంట్ రేటు రూ. 500 కాగా రూ.1199.95 దగ్గర ట్రేడ్ ప్రారంభించింది..ఆ  జైత్రయాత్ర  అలా 1400 రూపాయల వరకూ సాగింది. వంద తక్కువ మూడు రెట్లు లాభం తెచ్చింది


ఐపిఓ సమయంలో బీభత్సమైన డిమాండ్ తెచ్చుకున్న ఈ  ఐపి


ఓ దానికి తగినట్లుగానే లిస్టైంది. ఇష్యూ ఓవరాల్‌గా 69.43 రెట్లు..క్యుఐబి పోర్షన్ 203 రెట్ల బిడ్లు దాఖలు అయ్యాయ్


టాటా టెక్నాలజీస్ మేన్యుఫేక్చరింగ్ రంగంలోనే ఎక్కువ కేంద్రీకృతమై ఉన్న ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వ్యాపారం చేస్తుంటుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారమే ఈ కంపెనీకి ఎక్కువ. గత మూడేళ్లుగా టాటా ఎలక్స్జి, ఎల్ అండ్ టి టెక్నాలజీస్, కేపిఐటి టెక్నాలజీస్ కంటే ఎక్కువ కాంపౌండ్ ఆగ్రిగేట్ గ్రోత్ రెవెన్యూ సాధించగా, ఎబిటా మార్జిన్ 23.7శాతం నమోదు అవుతోంది. ఐపిఓకి ఇచ్చిన అలాట్‌మెంట్ రేటు చాలా ఫెయిర్‌గా ఉన్నట్లుప్రతి అనలిస్ట్ చెప్పడంతోనే ఈ స్థాయి ఆదరణ రాబట్టగలిగింది. 


ఇక లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేసినవారు ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయగా..లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు మాత్రం

టాటా టెక్నాలజీస్‌ని అట్టిపెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు

స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి టాటా టెక్నాలజీస్ షేర్లు రూ. 1303 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments