పండగ చేసిన ఫ్లెయిర్ రైటింగ్



ఐపిఓలు ఈ వారం దడదడలాడించేశాయ్. ఇన్వెస్టర్లకు సిరులు కురిపించాయ్. ఏదో నాసిరకంప్లాన్లతో వచ్చినవి కాకుండా..మిగిలిన 4 ఐపిఓలు కనకవర్షం కురిపించాయ్. ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఈరోజు దాన్ని కంటిన్యూ చేసింది. 66శాతం ప్రీమియంతో లిస్టై ట్రేడర్లకు బొనాంజా ఇచ్చింది

స్టాక్ ఇష్యూ ప్రైస్ రూ.304 కాగా..ఎన్ఎస్ఈలో 501 దగ్గర బిఎస్ఈలో 503 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది .రూ.514 వరకూ పెరిగింది.

స్టేషనరీ, పెన్నులు..ఇంక్‌లు..పేపర్, వగైరా స్టేషనరీ వ్యాపారంలో లీడింగ్ ప్లేయర్ అయిన ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ గత ఏడాదిలో 993శాతం సిఏజిఆర్ ని నమోదు చేసింది.ఇష్యూతో సేకరించిన 593కోట్ల డబ్బులో కొంతమొత్తంతో

గుజరాత్‌లో కొత్త తయారీ యూనిట్, ఇంకొంత అప్పు తీర్చేందుకువాడి..మిగిలిన మొత్తాన్ని కార్పోరేట్ అవసరాలకు వినియోగించనుంది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ఫ్లెయిర్ రైటింగ్‌లో ఇంక్ కాస్త తగ్గి రూ.450.90 దగ్గర ట్రేడ్ అయింది

Comments