మార్కెట్ల జోరు..న్యూట్రల్ గేర్లో ఆటోస్టాక్స్



శుక్రవారం మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత అదే జోరు కొనసాగిస్తున్నాయ్

నిఫ్టీ మరింత దూసుకుపోతుండగా,సెన్సెక్స్ కూడా తన పాత రికార్డ్ సరిచేసే దిశగా సాగుతోంది

ప్రస్తుతానికి 480 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై 67927..ఇది బ్రేక్ చేస్తే ఖచ్చితంగా 68వేలపాయింట్ల

మార్క్ కూడా స్క్రీన్‌పై రికార్డ్ కావడం ఖాయం


బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం లాభపడగా, ఐటి ఇండెక్స్ నష్టాల్లో ఉంది

మిగిలిన అన్ని సెక్టార్లూ లాభంతో ట్రేడవుతున్నాయ్. ఆయిల్  అండ్ గ్యాస్, మెటల్

సెక్టార్లు ముప్పావుశాతం ర్యాలీ చేయగా, ఆటో స్టాక్స్ న్యూట్రల్ గేర్‌లో సాగుతున్నాయ్

కేపిటల్ గూడ్స్ సెక్టార్ ఒకటిన్నరశాతం లాభపడ్డాయి


నిఫ్టీ50లో NTPC,ITC,కోల్ఇండియా, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్ రెండు నుంచి ఐదుశాతం

వరకూ ర్యాలీ చేశాయ్. బజాజ్ ఆటో, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్

సిప్లా అరశాతం నుంచి ఒకటింబావుశాతం నష్టపోయాయ్

Comments