గంధార్ ఆయిల్ దెబ్బకి రికార్డులు గజగజ..రెట్టింపైన లాభం

 మార్కెట్ కండిషన్‌తో సంబంధం లేకుండా  ఈ రోజు లిస్టైన ఐపిఓలు దంచి కొడుతున్నాయ్.గంధార్ ఆయిల్ రిఫైనరీ 75శాతం ప్రీమియంతో లిస్టై..ట్రేడర్లకు ధమాకా తెచ్చిపెట్టింది. 


ఇష్యూ ప్రైస్ రూ.169 కాగా..ఏకంగా రూ.298 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది. అలా సింగిల్ డేలోనే  129 రూపాయల లాభంతో ట్రేడ్ ప్రారంభమైంది. తర్వాత రూ.344కి ఎగసింది.సరిగా రెట్టింపు చేసిన ఈ సొమ్ముతో ట్రేడర్లలో ప్రాఫిట్ బుక్ ఆలోచన మొదలుకావడంతో..తిరిగి రూ.300 స్థాయికి పడిపోయింది


నవంబర్ 24న వచ్చిన ఈ ఐపిఓకి రిటైల్ ఇన్వెస్టర్ కేటగరీలో 29 రెట్ల స్పందన..హెచ్ఎన్ఐ క్లయింట్ల విభాగంలో 62 రెట్ల బిడ్లు రాబట్టింది. ఓవరాల్‌గా 64 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది


జస్ట్ 302 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు వచ్చిన  ఈ పర్సనల్ హెల్త్ కేర్ పెర్ఫామెన్స్ ఆయిల్స్, లూబ్రికెంట్స్ కంపెనీ డాబర్, మారికో, యూనిలీవర్, ప్రోక్టెర్ అండ్ గేంబుల్, పతంజలి, బజాజ్ కన్జ్యూమర్ కేర్, ఇమామి, అమృతాంజన్ వంటి కంపెనీలకు

ముడిసరుకు సప్లై చేస్తుంది. అవి జస్ట్ బ్రాండ్ పేరు వేసుకుని అమ్మకాలు సాగిస్తుంటాయ్. 

కంపెనీ ఫైనాన్షియల్ నంబర్లు చూస్తే మైండ్ బ్లాకవుతుంది. ఆపరేషనల్ రెవెన్యూ రూ.4079 కోట్లుకాగా..అంతకి ముందటి ఏడాది ఇది రూ.3543 కోట్లు..నికరలాభం 2023లో రూ.213 కోట్లుకాగా..2022లో రూ.163.58 కోట్లు


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి గంధార్ ఆయిల్ స్టాక్ రేటు రూ. 306.70 దగ్గర ట్రేడ్ అయింది

Comments