కార్‌ట్రేడ్ టెక్నాలజీస్‌ కౌంటర్ ఫుల్ రష్..రీజన్ఇదే బాస్

 


ఆన్‌లైన్ క్లాసిపైడ్స్, ఆటోమొబైల్ ఆక్షన్ వ్యాపారం  చేసే కార్ ట్రేడ్ టెక్నాలజీ షేర్లలో ప్రస్తుతం మంచి ఊపు కన్పిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ స్టాక్ 13శాతం పెరిగి రూ.825 ధరకి చేరింది. ఇది ఈ స్టాక్ గత 52వారాల్లోని గరిష్ట ధరగా చెప్పాలి.


నవంబర్ 9న ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అద్భుతంగా కన్పించడమే కార్ ట్రేడ్ టెక్నాలజీస్ షేర్ల ర్యాలీకి కారణం. జులై-సెప్టెంబర్ మధ్యలో కార్ ట్రేడ్ టెక్నాలజీస్ లాభం ఏకంగా 134శాతం పెరిగి 12 కోట్లు 96లక్షల రూపాయలు రాబట్టింది. అలానే ఆదాయం44శాతం ఎక్కువగా ఆర్జించింది. మొత్తంఆదాయం రూ.330కోట్లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది


 అందుకే శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ కౌంటర్‌పై జనం ఇరగబడ్డారని చెప్పాలి. ఏకంగా

పదకొండున్నర సయమానికే పదహారు లక్షల షేర్లు చేతులుమారాయ్. 

Comments