ముత్తూట్ ఫైనాన్స్ లాభం కేక,స్టాక్ క్రాక్

 

ముత్తూట్ ఫైనాన్స్ లాభం కేక పుట్టించినా..శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ మాత్రం  క్రాక్ అయింది

ఇంట్రాడేలో ఈ స్టాక్ 7శాతానికిపైగా నష్టపోయి రూ.1216రేటుకి పడింది


లాభం జనరల్ ఆడియెన్స్ పరంగా అదరగొట్టినా..ట్రేడ్ పండితులు మాత్రం

అంచనా వేసిన దానికంటే తక్కువ లాభం వచ్చిందని అభిప్రాయపడ్డారు. క్యు2లో

అంటే గడిచిన జులై-సెప్టెంబర్ మధ్యలో రూ.991కోట్ల లాభం నమోదు చేసిందీ గోల్డ్ లోన్

కంపెనీ . గతేడాదితో పోల్చితే ఇది 14.30శాతం ఎక్కువ. నికరంగా వడ్డీ ఆదాయం 18శాతానికిపైగా పెరిగి రూ.1858.40కోట్లు ఆర్జించింది. అలానే కంపెనీ ఈ సంవత్సరం మొదటి ఆరునెలల్లో

హయ్యెస్ట్ గ్రోత్ రికార్డ్ చేసింది. లోన్ అసెట్స్ 21శాతం పెరిగి రూ.11771 కోట్లకి..గోల్డ్ అసెట్స్ 20శాతం పెరిగి  11016 కోట్లకి చేరాయ్. 


ఈ దశలో మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ అంచనా ప్రకారం స్టాక్ రేటు రూ.1270కి చేరుతుందని

న్యూట్రల్ కాల్ మెయిన్‌టైన్ చేస్తున్నట్లు చెప్పింది. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, 17మంది అనలిస్టులు

ముత్తూట్‌ని కవర్ చేస్తుండగా, స్టాక్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి రూ.1362గా తేలింది. ఇది 

ఇప్పుడున్న రేటు కంటే 8శాతం ఎక్కువ

Comments