కేక పుట్టించిన నిఫ్టీ, దుమ్ము రేపి దంచికొట్టినమార్కెట్లు

 

మార్కెట్లలో ఓ బిగ్ ర్యాలీ చోటుచేసుకుంది. ఊహించినది కొద్దిగా అయినా..ఎక్కువమంది అంచనాలను తలకిందులు చేస్తూ..నిఫ్టీ రెసిస్టెన్స్ లెవల్స్‌ని బ్రేక్ చేసి 20096 పాయింట్లకు ఎగసింది. ఇంట్రాడేలో 20104 పాయింట్లు కూడా చేరింది. ఆల్ టైమ్ హైకి 20222కి ఓ 120 పాయింట్ల దూరంలో వెనక్కి తిరిగింది


సెన్సెక్స్ ఓవరాల్‌గా 727 పాయింట్లు లాభపడి 66901.91 పాయింట్ల దగ్గర ముగియగా

 ఇంట్రాడేలో ఈ లాభం మరో 43 పాయింట్లు ఎక్కువ. అంటే రెండు ఇండెక్స్‌లు కూడా

దాదాపుగా డే హై దగ్గరే క్లోజ్ అయ్యాయ్


ఆటోసెక్టార్ ఒకటిన్నరకి పైగా..బ్యాంక్ నిఫ్టీ ఒకటిన్నరశాతంలాభపడగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ ఒక్కటే స్వల్ప నష్టంతోముగిసింది. మిగిలిన అన్నీ లాభాలతో నిలిచాయ్


నిఫ్టీ ప్యాక్‌లో యాక్సిస్ బ్యాంక్, హీరోమోటోకార్ప్,మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టాటామోటర్స్ ,రెండు నుంచి నాలుగు శాతం లాభపడ్డాయ్. ఓఎన్‌జిసి, దివీస్ ల్యాబ్స్, నెస్లే, టైటన్ కంపెనీ, ఐషర్ మోటర్స్ స్వల్ప స్థాయినుంచి ఒకశాతంవరకూ నష్టపోయాయ్

Comments