బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఫైన్..పట్టించుకోని ట్రేడర్స్

 ప్రొసీజరల్ ల్యాప్స్ చోటు చేసుకోవడంతో...బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్బీఐ భారీ జరిమానా విధించింది,ఈ నేపథ్యంలోనే మంగళవారం ట్రేడ్‌లో ఈ బ్యాంక్ స్టాక్ ట్రేడ్‌పై ఆసక్తినెలకొన్నది. ఐతే ఆ ప్రభావం ఏ మాత్రం కనబడటం లేదు..స్టాక్ ఇంట్రాడేలో ఇప్పటికే రూ.195.35 వరకూ పెరిగింది. 



లార్జ్ కామన్  ఎక్స్‌పోజర్ విషయంలో ఆర్బీఐ  4.34 కోట్ల జరిమానా విధించింది.

లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లపై వడ్డీ ఇతరత్రా అంశాలపై ఈ సెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటుని నిబంధనలకు అనుగుణంగా చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గుర్తించింది. 


మీకు గుర్తుండి ఉంటే..యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎప్‌సి బ్యాంక్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, యాప్స్ విషయంలో సరైన కార్పొరేట్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ నామ్స్ పాటించడం లేదని గతంలో ఆర్బీఐ ఆక్షేపిస్తూ జరిమానాలు, ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాజా పరిణామం చూస్తుంటే..బ్యాంకులు తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ కానీ..డిజిటల్ యాప్స్ విషయంలో, అలానే

కొన్ని టెక్నికల్ ఇంటర్నల్ ఇష్యూల విషయంలో ఇంటర్నేషనల్ రేంజ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం లేదనే అనుమానం కలగకమానదు


బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ గత ముగింపు రేటు రూ.193.10

Comments