CG పవర్ సూపర్ ప్లాన్, దంచికొట్టేసిన స్టాక్


 సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ CG పవర్ కంపెనీ మంత్రిత్వశాఖకి అప్లై చేయడమే ఆలస్యం  స్టాక్ రేటు కేక పుట్టించేసింది. ఇంట్రాడేలో 20శాతం పెరిగి రూ.469.35 రేటుకి చేరింది. ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు



స్టాక్ ఎక్స్ఛేంజీకి విడుదల చేసిన ఒక ప్రకటనలో, తాము సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ఒకటి పెడతామని..దానికోసం  రాయితీలు కోరుతూ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ధరఖాస్తు చేసినట్లు తెలిపింది. 


"ఔట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ (OSAT) సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి,సబ్సిడీని మంజూరు చేయడానికి అనుమతి కోరుతూ కంపెనీ ఈరోజు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)కి ఒక దరఖాస్తును దాఖలు చేసాము..ఈ మేరకు మీకు తెలియపరచడమైనది.. కాంపౌండ్ సెమీకండక్టర్స్/సిలికాన్ ఫోటోనిక్స్/సెన్సర్స్ ఫ్యాబ్/డిస్క్రీట్ సెమీకండక్టర్స్ ఫ్యాబ్ మరియు సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ మరియు ప్యాకేజింగ్ ఏర్పాటు కోసం సవరించిన పథకం కింద ప్రాజెక్ట్

(ATMP) సౌకర్యాలు భారతదేశంలో ఉన్నాయి" అని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరించడం జరిగింది.

బై ఆన్ న్యూస్..సెల్ ఆన్ రూమర్స్‌లాగా..కంపెనీ కేవలం ఇదిగో ఇలా ఓ యూనిట్ మేం పెట్టాలనుకుంటున్నాం..పర్మిషన్ కావాలి అంటేనే

ఇలా షేర్లు పెరిగితే..ఇక నిజంగా మినిస్ట్రీ నుంచి నామినల్ పర్మిషన్ వచ్చేసిందంటే..పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి


Comments