రిటైల్ ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్..CICగా మార్పు కోసం అప్లికేషన్

 రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డీమెర్జ్డ్ ఎంటిటీ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ ఆదేశాన్ని అనుసరించి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-NBFC నుంచి  కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ-CICగా మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కి దరఖాస్తును సమర్పించింది.



నిన్నటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, ఆర్‌బిఐ ఆదేశం ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడదీయబడిన తర్వాత దాని వాటాల నమూనా, నియంత్రణను మార్చడానికే ఎన్‌బిఎఫ్‌సి నుండి సిఐసికి మార్చుకోబోతున్నట్లు  కంపెనీ తెలియజేసింది.


ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్లు లేదా కన్వర్టిబుల్స్ బాండ్‌లు లేదా లోన్‌ల రూపంలో తమ గ్రూప్ కంపెనీలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టే కంపెనీలను CICలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ సిఐసి కంపెనీలు- తమ గ్రూప్ కంపెనీలపై నియంత్రణను కొనసాగించడానికి ఉద్దేశించబడినవి..అంతేకాదుఇతర ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించవు. అంటే ఈ మార్పు తర్వాత..ఇక జియో ఫైనాన్షియల్ కంపెనీ..కేవలం తమ గ్రూప్ కంపెనీలకు లోన్లు

షేర్లు జారీ,ఆయా కంపెనీలకు గ్యారంటీర్‌గా ఉండటం  చేస్తుందే తప్ప బయట ఎలాంటి కార్యకలాపాలు సాగించదని అర్థమవుతోంది. దీంతో NBFC కంపెనీగా దీని ప్రస్థానం దాదాపు తొందర్లో ముగిసినట్లే భావించాలి


జనరల్గా జియోఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ NBFC అనగానే..కన్జ్యూమర్ లోన్లు..పర్సనల్ లోన్లు..హోమ్ లోన్లు..ఇతరత్రా ఊహించుకున్నవాళ్లకి ఇప్పుడిది తమ గ్రూప్ కంపెనీలకు లోన్లు,గ్యారంటీ ఇచ్చుకునే కంపెనీ అంటే సహజంగానే ఇంట్రస్ట్ చచ్చిపోతుంది

Comments