రిస్క్ లేని రిటన్స్ ఇచ్చే FDలు..ఆఫర్ చేసే బ్యాంకులివే

 ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

మూడేళ్ల ఎఫ్‌డీపై 8.11 శాతం వడ్డీ రేట్ వస్తుంది. అంటే రూ.1 లక్ష డిపాజిట్ చేసిన వారికి మూడేళ్ల తర్వాత రూ. 1.27 లక్షలు వస్తాయి.


సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank)..

 మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.6 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒక లక్ష ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 1.29 లక్షలు వస్తాయి.


జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల ద్వారా ఇన్వెస్టర్లకు గరిష్ఠంగా 8.5 శాతం మేర వడ్డీ అందిస్తున్నాయి. ఈ రెండు బ్యాంకుల్లో మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మూడేళ్ల తర్వాత రూ.1.28 లక్షలకుపైగా అందుతాయి.





AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank), ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే మూడేళ్ల తర్వాత చేతికి రూ.1.27 లక్షలు వస్తాయి.


ఐతే తెలుగు నగరాల్లో ఈక్విటాస్..ఉజ్జీవన్, ఏయూ స్మాల్ పైనాన్స్ బ్యాంకులు మాత్రమే ఎక్కువగా బ్రాంచులు నిర్వహిస్తున్నాయి కాబట్టి..ఈ రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఓకే

అనుకుంటే..వీటిలో డిపాజిట్లు తీసుకోవచ్చు

Comments