HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్ షేర్లకు షాక్ ..ఎందుకిలా



హై రిస్క్ లోన్ల విషయంలో ఆర్బీఐ చర్య, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో

HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్ షేర్లను 6శాతం వరకూ పడదోసింది

ఎందుకిలా జరిగిందంటే..!


లోన్ ప్రొవిజన్ల కోసం ఇప్పుడు కేటాయిస్తున్నదానికంటే ఎక్కువ మొత్తం పక్కనబెట్టాల్సి

రావడం బ్యాంకులకు కేపిటల్ నిష్పత్తిపై ప్రభావం చూపనుంది. దీనికోసం ఇక అనివార్యంగా తమ కస్టమర్లకి ఇచ్చే లోన్లవడ్డీని పెంచుతుంది. అలా చేయకుండా..ఈ లోన్ల జారీనే కఠినతరం చేసుకున్నా..వ్యాపార పరిణామంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 


ఇంతకీ ఆర్బీఐ తీసుకున్న చర్య ఏమిటయ్యా అంటే,...ఏ విధమైన గ్యారంటీ..( డిపాజిట్, స్థలం,ఇళ్లు వాహనం)లేన అప్పులు..ఎగ్గొట్టబడితే..అదిబ్యాంక్ తాలుకూ మూలధనాన్ని దెబ్బతీసి..దివాలాకి దారితీయవచ్చు

అంటే ఇలాంటి తిరిగిరాని అప్పుల మొత్తం..బ్యాంకుల తాలుకూ రిజర్వ్ ఫండ్..కస్టమర్లకి ఇవ్వాల్సిన మొత్తం డిపాజిట్లపై వడ్డీ వంటి ఇతర ధనం కంటే ఎక్కువైనా, లేకపోతే..సమానంగా ఉన్నా...అంతిమంగా అది బ్యాంకు ఆర్థిక స్థితి, బ్యాలెన్స్ షీట్‌ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇలాంటి అన్‌సెక్యూర్డ్ లోన్ల విషయంలో

ఏదైనా నష్టాలు సంభవించినప్పుడు ఆ ప్రభావం బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై పడకుండా ఉండేందుకు, ముందుగానే కొంత మొత్తం కేటాయిస్తుంది. దీన్నే ప్రొవిజన్ మనీ అనవచ్చు..అలాంటి ప్రొవిజన్‌ని ఇప్పుడు ఆర్బీఐ పెంచింది


ఉదాహరణకు..బజాజ్ ఫైనాన్స్ 230బేసిస్ పాయింట్లమేర ప్రొవిజన్ కేటాయింపులు పెంచాలి.HDFC, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వరసగా 50  బిపిఎస్, 42 బిపిఎస్, 36 బిపిఎస్, 27 బిపిఎస్ మేర తమ ప్రొవిజన్లను పెంచాల్సి ఉంటుంది. 


ఈ తాజా ఆదేశాల నుంచి ఆర్బీఐ, హౌసింగ్, ఎడ్యుకేషన్, వెహికల్, గోల్డ్ లోన్లకు మినహాయింపు ఉంది. 

Comments