గురి పెట్టి కొడితే టార్గెట్ బద్దలవ్వాల్సిందే..IREDA అప్పరప్పర తాండ్ర, కనకవర్షం కురిపించిన స్టాక్



IREDA ఐపిఓ గురించి లాస్ట్ వీక్ ఓ స్టోరీ ప్రచురించాం. గుర్తుండే ఉంటుంది

టాటా టెక్నాలజీస్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు..ఈ ఐపిఓ గురించి కూడా

చూడండి తప్పకుండా అప్లై చేయండి అనేదే ఆ కథనం సారాంశం..దానికి తగినట్లుగానే

ఇవాళ ఈ కంపెనీ ఐపిఓ ఏకంగా అప్పరప్పర తాండ్ర రాగమేసింది. చెప్పినట్లుగానే

అరవైరూపాయల దగ్గర సీల్ పడి బీభత్సమైన డిమాండ్ క్రియేట్ చేసింది


మార్కెట్ కేపిటలైజేషన్ రూ.16124 కోట్లకు చేరిన ఈ మినీరత్న కంపెనీ ఇప్పుడు ఖచ్చితంగా

రాబోయే రెండు రోజులు ట్రేడింగ్ మజాగా ఉండబోతుంది. ప్రాఫిట్ బుకింగ్ రేపట్నుంచి కనబడుతుంది

అలానే కొత్త హార్స్ రైడర్లు బయలుదేరుతారు. 


సో..అలా రూ.32 దగ్గర అలాటైన IREDA షేర్లు..ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయ్..మరి 

దీనిపై శషబిషలు అనవసరం..కేపిటల్ తీసేసుకుని..మిగిలినదాంతో ఎంజాయ్ చేయడమే ప్రాథమిక

సూత్రం ఇన్వెస్టర్లు ఫాలోఅయితే బెటరనేది ఎవరైనా చెప్పేదే...!

Comments