అండర్ ‌వెయిట్ స్టాక్‌గా L&T ఫైనాన్స్, 5శాతం పతనం



ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్ కంపెనీ స్టాక్ ఈ రోజు( శుక్రవారం)

5శాతం పతనం అయింది. బ్యాంకింగ్ సెక్టార్‌కి ఓ బ్యాడ్ న్యూస్ ఆర్బీఐ

ఆదేశాల రూపంలో రావడమే ఇందుకు కారణం. 


కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు

అవి ఇచ్చే ఋణాలపై రిస్క్ వెయిటేజ్ పెంచాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించడమే ఇందుకు కారణం

అన్ సెక్యూర్డ్ లోన్ల కేటగరీలో ఇలా పాతికశాతం రిస్క్ వెయిటేజ్ ఆర్బీఐ పెంచింది. తదనుగుణంగా

బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర డిపాజిట్లను పెంచాలి..అలానే ఆ భారం తగ్గించుకునేందుకు కస్టమర్లకి

ఇచ్చే లోన్లపై వడ్డీలు పెంచుకుంటాయ్..ఈ కోణంలో మార్జిన్లు తగ్గుతాయనే ఆలోచనతో ట్రేడర్లు

ఇవాళ బ్యాంక్, ఎన్‌బిఎఫ్‌సి  స్టాక్స్‌పై విరుచుకుపడ్డారు..దీంతో ప్రతి స్టాక్ నష్టపోయింది


ఎల్ అండ్ టి ఫైనాన్స్ 142.85కి పతనం అయింది


వడ్డీ రేట్లు పెంచితే..ఈ లోన్లు తీసుకునే కస్టమర్లు వెంటనే తీసుకోరు..అలానే వడ్డీ వ్యాపారం..ఆదాయం తగ్గితే బ్యాంకుల

ఆదాయం, లాభం రెండూ తగ్గుతాయి. బార్ గెయినింగ్ కోణంలో పోటీ కూడా పెరుగుతుంది.ఇలాంటప్పుడు అన్ సెక్యూర్డ్ లోన్ల

జారీ ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేకాదు..ఈ అన్ సెక్యూర్డ్ లోన్లలోనే బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు పండగ చేసుకుంటుంటాయ్. 12 శాతం

నుంచి 18శాతం, కొండకచో..24శాతం వడ్డీని కూడా పర్సనల్ లోన్ విభాగంలో వసూలు చేస్తుంటుంటాయ్. మరి ఈ తరహా లోన్ల సంఖ్య

తగ్గితే అది మొత్తం ఆదాయంపై ప్రభావం చూపడం అనేది సహజమైన ప్రక్రియే కదా..!


డిఫాల్టర్లు..డిఫాల్ట్ లోన్లు తగ్గడానికి..బ్యాంక్ వ్యవస్థ లోపభూయిష్టంగా, దివాళా తీయకుండా ఉండటానికి

ఇది సరైన చర్య అయితే కావచ్చు కానీ...ఋణగ్రహీతల కోణంలో మాత్రం జేబుకి చిల్లి పెట్టేదే..!

Comments