నిన్నటి మార్కెట్లలో LIC ప్రభంజనం వెనుక రీజన్, బోసలే ఏమంటున్నాడో తెలుసా




LIC స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత అత్యంత నష్టదాయక షేరుగా పేరుతెచ్చుకుంది.ఐతే నిన్న మాత్రం భారీ ర్యాలీ చేసింది. సింగిల్ డే బిగ్గెస్ట్ ర్యాలీగా కూడా చెప్పొచ్చు.  దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి ఎల్ఐసిపై అన్నివర్గాల్లో భారీ చర్చ చోటు చేసుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో అత్యధికంగా రూ.682 ధరను చేరుకుంది.


మరిప్పుడు ఈ జర్నీ ముందుకే సాగుతుందా..అంటే ఫస్ట్ ఈ ర్యాలీకి కారణమేంటో తెలుసుకుందాం, నిన్న ఎల్ఐసి చైర్మన్ సిద్దార్థ మొహంతి తొందర్లోనే తామొక కొత్త ప్రొడక్ట్ లాంఛ్ చేస్తామని ప్రకటించారు..అది ఎర్లీ విత్ డ్రాయల్..అలానే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‍మెంట్

వన్ టైమ్ ప్రీమియంతో కూడా ప్రొడక్ట్స్ రానున్నాయని చెప్పారు. వీటిలో మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారు జీవితకాల బీమా మొత్తంలో 10 శాతం పొందుతారని మహంతి తెలిపారు.దీంతో సంప్రదాయబద్దంగా వ్యవహరించే ఎల్ఐసి..ఇతర కంపెనీలకు ధీటుగా

ఏదైనా చేయనుందనే ఫీలింగ్ ఏర్పడింది. 


LIC షేర్లు మే 17,2022న ఇష్యూ ప్రైస్ అయిన రూ.949కి 8శాతం డిస్కౌంట్‌తో ట్రేడింగ్ ప్రారంభించింది.  పడుతూ పడుతూ 530 స్థాయికి కూడా  పతనమైంది. ఇప్పుడు తిరిగి పైకి లేవడం చూస్తుంటే అలాట్‌మెంట్ రేటువస్తుందేమో అనే తపన పడుతున్నవారున్నారు. ఐతే వచ్చే వారంలో  షేర్ ధర రూ.800కి చేరే అవకాశం ఉందని ఏంజెల్ వన్ ఈక్విటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ రాజేష్ భోసలే అంచనా వేస్తున్నారు


బీమా మార్కెట్లో ఎల్ఐసీ 58.50 శాతం సింహభాగంతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. H1FY24 కోసం దాని కొత్త బిజినెస్ ప్రీమియం H1FY23లో రూ.24,535 నుంచి 2.65% పెరిగి రూ.25,184 కోట్లకు చేరుకుంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు సెప్టెంబర్ 30, 2022లో ఉన్న రూ.42,93,778 కోట్లతో పోలిస్తే10.47 శాతం పెరిగి సెప్టెంబర్ 30, 2023 నాటికి రూ.47,43,389 కోట్లకు పెరిగింది.

Comments

  1. వచ్చే వారం లో ఎల్ ఐ సీ 800 కు‌ చేరుకుంటదా :) ఐతే అమ్మేద్దాం పదండి :)

    ReplyDelete

Post a Comment