విలీనాల కథలు..కల్పితం..ఆ 2 బ్యాంక్ స్టాక్స్ డౌన్



వచ్చే నెలలో కేంద్రప్రభుత్వం బ్యాంకుల విలీనం చేయనుందంటూ ప్రచారం సాగడంతో..

కొంత హైప్ నెలకొన్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఆ మేరకు కొన్ని బ్యాంకుల షేర్లు భారీగా పెరిగాయ్. ఐతే

అదేం లేదంటూ క్లారిటీ రావడంతో..సదరు స్టాక్స్‌లో తిరిగి డౌన్ ట్రెండ్ చోటు చేసుకుంది


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2శాతం వరకూ పతనై రూ.46.55 వరకూ రాగా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 4శాతం నష్టపోయి రూ.123 రేటుకు వచ్చాయి

బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు అరశాతం నష్టపోయి 110.80 రేటుకు

యూకో బ్యాంక్ మాత్రం రూ.41 రేటు దగ్గర ట్రేడ్ అయ్యాయ్. తర్వాత ఇంట్రాడేలో 3శాతం వరకూ లాభపడి రూ.42.75కి చేరాయి

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రేటు రెండున్నరశాతం పెరిగి రూ.45.70కి చేరాయి

Comments