ఆజాద్ కా లా జవాబ్..సూపర్ సక్సెస్ ఐపిఓ. డిసెంబర్ 28న కాసులు గలగల

 ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓ సూపర్ సక్సెస్ అయింది. ఇక లిస్టింగ్ రోజున కాసుల గలగల శబ్దం వినిపించడమే తరువాయిగా ఉంది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి ఈ ఇష్యూ కనీసం 70శాతం ప్రీమియం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు


ఇష్యూ అలాట్‌మెంట్ రేటు రూ.524 కాగా..ట్రిపుల్ ఎయి
ట్(888) రేటుతో లిస్ట్ కావచ్చనేది ప్రస్తుతానికి ఉన్న  అంచనా


ఆజాద్ ఇంజనీరింగ్  ఐపీఓ 70.33 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.QIB కోటా153.13 రెట్లు, హైనెట్వర్త్ ఇఁడివిడ్యువల్స్ కేటగరీ 79.71 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 21.32 రెట్లు

బిడ్లు దాఖలు అయ్యాయ్. ఇక 4 కోట్లరూపాయలకు సమానమైన షేర్లను ఉద్యోగులకు రిజర్వేషన్ చేశారు. ఇది కూడా 11.80 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.


తెలంగాణకు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ ఇంజినీర్డ్ ప్రెసిషన్ ఫోర్జ్డ్, మెషిన్డ్ కాంపోనెంట్స్ మేకర్ IPO నుంచి రూ.740 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్  500 కోట్ల విలువైన షేర్లు కాగా.. ప్రమోటర్ రాకేష్ చోప్దార్, ఇన్వెస్టర్ పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్,DMI ఫైనాన్స్ OFSలో షేర్లను విక్రయిస్తారు


షెడ్యూల్ ప్రకారం ఆజాద్ ఇంజనీరింగ్‌ డిసెంబర్ 28న లిస్ట్ అవుతాయ్

Comments