3 నెలల్లో PNB భారీ ప్లాన్

 ఫాలో ఆన్ పబ్లిష్ ఇష్యూ లేదంటే క్యిప్ పద్దతిలో 7500కోట్ల మేర నిధులు సేకరించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెడీ అయింది. ఐతే ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అని ఎక్స్‌ఛేంజ్‌లకు తెలిపింది. 



అంటే 2024 మార్చి తర్వాత ఈ ధనసమీకరణ ఉంటుంది. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్

అనుమతి ఇచ్చినట్లు తెలుపడంతో..పిఎన్‌బి స్టాక్ రేటు ఇవాళ 96.65 వరకూ వెళ్లింది. గత ముగింపు కంటే ఒకశాతం లాభపడి, తర్వాత అరశాతం నష్టపోయింది. నిన్న మాత్రం ఏకంగా ఏడుశాతం దంచికొట్టింది


ఈ కంపెనీ మాల్యాలు, నీరవ్ మోదీ దెబ్బకి కుదేలైంది కానీ..లేదంటే గతంలో ఈ బ్యాంక్ స్టాక్ రూ.279 దగ్గర ట్రేడ్ అయ్యేది దీనికితోడు తీసుకున్న అప్పులకు ఎక్కువ వడ్డీలు కట్టాల్సి రావడం ఈ బ్యాంక్‌కి ఉన్న మరో మైనస్ పాయింట్

ఐతే ఇప్పుడిప్పుడే తనకి కవరేజ్ ఇచ్చిన బ్రోకరేజ్ కంపెనీలు స్టాక్ రేటుని అప్‌గ్రేడ్ చేయడం గమనించాలి

Comments