పాలీక్యాబ్‌కి ఐటీ షాక్..స్టాక్ కి 5% డౌన్




 మల్టీబ్యాగర్ కంపెనీ పాలీక్యాబ్ ఇండియాకి పెద్ద కుదుపు...కంపెనీకి చెందిన 23 తయారీకేంద్రాలు,15 ఆఫీసులు 25వేర్‌హౌస్‌లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేస్తుండటమే ఇందుకు కారణం. అంతేకాదు సంస్థల ఉన్నతాధికారులు..మేనేజ్‌మెంట్ఇళ్లలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీంతో  కంపెనీ షేర్లలో ఉలికిపాటు చోటు చేసుకుని 5 శాతం వరకూ పతనం అయ్యాయ్

ఇంట్రాడేలో రూ.5362 రేటుకు చేరుకున్నాయ్


పాలీక్యాబ్ ఇండియా కేబుల్ వైర్లు, కరెంట్ వైర్లతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో

వ్యాపారం చేస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో బీభత్సమైన లాభం కూడా నమోదు చేసింది. నిరుడుతో పోల్చితే ఏకంగా 58శాతం పెరిగి రూ.436.89 కోట్ల లాభం ప్రకటించింది. రెవెన్యూ చూస్తే 27శాతం పెరిగి రూ.4253కోట్లకి చేరింది


ఈ కంపెనీ షేర్లు 2023లో రెట్టింపు అవగా స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.5375 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments