ఐదుశాతం పరిగెత్తిన BHEL



ఒడిశాలోని ఓ ప్రాజెక్ట్‌ని దక్కించుకునే రేసులో BHEL, L&Tని కూడా ఓవర్‌టేక్ చేసిందనే

న్యూస్‌తో ఈ కంపెనీ స్టాక్స్ రివ్వున దూసుకుపోయాయ్. ఇంట్రాడేలో 5శాతం లాభపడి

రూ.204.65కి చేరాయి. 


NLCకి చెందిన తలబిరా ప్రాజెక్ట్‌కి సంబంధించిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ రూ.19422 కోట్లతో బిడ్ కోట్ చేసి లోయెస్ట్ బిడ్డర్‌గా అవతరించిందనేది సమాచారం.  ఈ ప్రాజెక్ట్ కోసం LT కూడా బిడ్ వేసింది

ఈ ప్రాజెక్ట్ కింద మూడు అల్ట్రా సూపర్ క్రిటికల్ 800మెగావాట్ల యూనిట్లను తలబిరాలో స్థాపించాల్సి ఉంది. ఐతే మరో సమాచారం ప్రకారం అసలు ఎల్ అండ్ టి ఈ పనుల కోసం బిడ్లే వేయలేదంటున్నారు.


నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో బిహెచ్ఈఎల్ రూ.238 కోట్లకిపైగా నష్టం ప్రకటించింది.  స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి బిహెచ్ఈఎల్ షేర్లు రూ.200 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments