పాజిటివ్ మూడ్, రేంజ్ బౌండ్ ట్రేడ్

 స్టాక్ మార్కెట్లు నిన్నంతా పాజిటివ్ మూడ్‌లోనే సాగగా 21,500-21,600 వద్ద నిఫ్టీ రెసిస్టెన్స్ ఎదుర్కొన్నది.అలానే రాబోయే రోజుల్లో కూడా  మార్కెట్ రేంజ్‌బౌండ్‌గా ఉంటుందని,21,200-21,000 స్థాయిల ట్రేడవ్వచ్చని అంచనా. అందుకే ఈ వారంలో వాల్యూమ్స్ కూడా తక్కువగా ఉన్నాయంటున్నారు. 



అలానే బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడు రోజుల పాటు తమ ఊపును కొనసాగించాయి. డిసెంబర్ 26న సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337కి చేరుకోగా, నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 21,441కి చేరింది. 


మొత్తంమీద, నిఫ్టీ లాస్ట్‌వీక్ ఓ రోజు పతనమైన దాంట్లో ఎక్కువభాగం పూడ్చుకున్నట్లే, ఇలాంటి సిచ్యుయేషన్‌లో "ప్రస్తుత డౌన్‌ట్రెండ్‌ను రివర్స్ చేయడానికి నిఫ్టీ  గరిష్ఠ స్థాయిలైన 21,593ని దాటవలసి ఉంటుంది. వీక్‌నెస్ కన్పించకుండా ఉండాలంటే సపోర్ట్ లెవల్  21,329-21,232 దగ్గరుంది అంటూ హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌-సీనియర్ టెక్నికల్, డెరివేటివ్ అనలిస్ట్ సుబాష్ గంగాధరన్ చెప్తున్నారు


మరో అనలిస్ట్ (ఏంజెల్ వన్‌) రాజేష్ భోసలే కూడా 21,550 - 21,600 శ్రేణిలో రాబోయే సెషన్‌లు క్లిష్టమైనవిగా చెప్తుండటం గమనార్హం. ఆయన చెప్తున్న ఈ లెవల్  అక్టోబర్ నెల నుంచి ఎకాఎకిన పెరిగిన ప్రస్తుతస్థాయిగా చూడాలి

Comments