అదరగొట్టిన అంబానీ,లక్షలకోట్లు పెరిగిన సంపద..భారీగా కోల్పోయినా సెకండ్ ప్లేస్‌లో అదానీ



2023లో ముకేశే అంబానీ ఆస్తుల విలువ ఏకంగా పదిబిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో దేశంలోనే అధిక సంపన్నుడిగా అలానే ప్రపంచంలో పదమూడో ధనవంతుడిగా నిలిచారు. ఈ ఏడాదిలో ఆయన( బ్లూమ్‌బెర్గ్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం)9.98 బిలియన్ డాలర్లమేర తన సంపద పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన అధీనంలో ఆస్తుల విలువ మొత్తం $97.1 బిలియన్ల సంపదకి చేరింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ , జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కారణంగానే  ఈ స్థాయిలో సంపద పెరిగింది. 

తర్వాత .హెచ్‌సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రెండవ స్థానంలో ఉన్నారు, ఈ సంవత్సరం ఆయన సంపదకు $9.47 బిలియన్‌లను జోడించి, $34 బిలియన్లకు చేరుకున్నారు. ఐటి సెక్టార్ టఫ్ టైమ్స్‌లోనూ హెచ్‌సిఎల్ టెక్ షేర్లు 41 శాతం పెరిగాయి.


ఈ జాబితాలో OP జిందాల్ గ్రూప్ మాజీ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు.  మొత్తం ఆమె ఆస్తుల విలువ $24.7 బిలియన్లతో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి.  జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ మరియు జిందాల్ ఎనర్జీ వంటి గ్రూప్ కంపెనీల షేర్ల నుంచి ఈ స్థాయికి రాగా, ఈ  ఏడాదిలో  తన సంపదలో $8.93 బిలియన్లను చేర్చుకుంది. తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజం DLF -కుశాల్ పాల్ సింగ్, DLF షేర్ ధరలో 91 శాతం పెరుగుదల కారణంగా 2023లో $7.83 బిలియన్ల పెరుగుదల కనిపించింది.  ప్రస్తుతం సింగ్ ఆస్తుల నికర విలువ 16.1 బిలియన్ డాలర్లుగా ఉంది.


158 ఏళ్లుగా కొనసాగుతున్న ఇంజినీరింగ్ , కన్‌స్ట్రక్షన్ కంపెనీ  షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌- షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు..మిగిలిన వారిలో  ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా ($5.91 బిలియన్లు), సన్ ఫార్మా- దిలీప్ షాంఘ్వి ($5.26 బిలియన్లు), మంగళ్ ప్రభాత్ లోధా-లోధా గ్రూప్ ($3.91 బిలియన్), ఎయిర్‌టెల్ - సునీల్ మిట్టల్ ($3.62 బిలియన్లతో ఆరు నుంచి పది స్థానాలు అలంకరించారు


మరోవైపు, గౌతమ్ అదానీ 2023లో భారీగా మార్కెట్ కేపిటలైజేషన్ కోల్పోవాల్సి వచ్చింది.  అతని అనేక కంపెనీలలోని షేర్లను భారీగా విక్రయించడం వల్ల $37.3 బిలియన్ల మేర కోత పడింది. గౌతం అదానీ ఆస్తుల మొత్తం నికర విలువ ఇప్పుడు $83.2 బిలియన్లు.

Comments