దంచికొట్టిన కేన్స్ టెక్నాలజీస్ స్టాక్



క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.1400కోట్ల సమీకరణకు కేన్స్ టెక్నాలజీస్

తెరలేపింది. దీంతో షేరు ధర 5శాతం ర్యాలీ చేసింది. రూ.2743 ధరకి చేరుకుంది.

 నిన్నటి నుంచి ఈ క్విప్ పద్దతిలో షేర్ల కేటాయింపు ప్రారంభం కాగా

ఇవాళ షేరు ధర పరుగులు పెడుతోంది


క్విప్‌ కోసం ఫిక్స్ చేసిన ఫ్లోర్ ప్రైస్ రూ.2449.46పైసలు కాగా ఇది నిన్నటి క్లోజింగ్ రేటు కంటే 6శాతం తక్కువ .అలానే క్విప్ ముగిసిన 90 రోజుల వరకూ ప్రమోటర్లు ఎలాంటి లావాదేవీలకు దిగరాదనేది సెబీ నిబంధన


ఎలక్ట్రానిక్స్ మేన్యుఫేక్చరింగ్ రంగంలో నిమగ్నమైన కంపెనీ ఈ మధ్యనే అమెరికాకి చెందిన ఎలక్ట్రానిక్ మేన్యుఫేక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ  డిజికామ్ ఎలక్ట్రానిక్స్ సంస్థని 2.5మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి కేన్స్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు ఈ కింది విధంగా ట్రేడ్ అయ్యాయ్

2,723.60  121.95 (4.69%)


Comments